నారదుని సలహా

 

ఒకానొక సన్నివేశంలో నారదుడు ఈ విధంగా అన్నాడు:

“‘నాకు అనుభవం కాలేదు కనుక అది అవాస్తవం’ అని

ఎప్పుడూ అనవద్దు, ఏదేని విషయాన్ని శాస్త్రపరంగా.

కూలంకషంగా, అధ్యయనం చేస్తేనే వాస్తవం తెలుస్తుంది;

వాస్తవాలు తెలిస్తేనే మరి పరిస్థితులు అవగాహనకు వస్తాయి;

పరిస్థితులు అవగాహనకు వస్తేనే మరి సరియైన నిర్ణయాలు చేయగలం.”

అందుకే,

జీసస్ కూడా అన్నాడు:

“JUDGE YE NOT” అని . .

అంటే,

“ఎప్పుడూ త్వరపడి ఏ నిర్ణయానికీ రావద్దు” అని

  • ఏ విషయంలోనైనా నిజమైన అవగాహన అన్నది దివ్యచక్షువుతోనే సాధ్యం
  • యోగులే దేని గురించైనా సరియైన విధంగా తీర్పునివ్వగల సమర్థులు
  • యోగులు కాని వారు సమయోచిత తీర్పు ఎప్పటికీ చెప్పలేరు.