నాడీమండల శుద్ధి

 

మన నాడీమండలంలో,
అంటే ప్రాణమయకోశంలో
సుమారు రెండు లక్షల 72,000 నాడులు వుంటాయి.

“నాడి” అంటే “ప్రాణశక్తి ప్రవహించే గొట్టం” 
అంటే “ఎనర్జీ ట్యూబ్ ” అన్నమాట

“ఆనాపానసతి ” మొదలు పెట్టినప్పటి నుంచే
నాడీమండల శుద్ధి జరగడం ప్రారంభం అవుతుంది
అయితే, “నాడులు సాధారణంగా శుద్ధంగా వుండవా ? “
అంటే ..
కొన్ని వుంటాయి, కొన్ని వుండవు
మన పూర్వజన్మల పాపకర్మల వల్ల నాడులు అపరిశుద్ధంగా వుంటాయి
“మురికి చేరిన గొట్టాల ” మాదిరి వున్న మలిన నాడులన్నీ
కేవలం ” ఆనాపానసతి ” వల్లనే శుద్ధి అవుతాయి

కుండలినీ జాగృతమయి నాడీశోధనం జరుగుతున్నప్పుడు
అన్నమయకోశంలో విపరీతమయిన నొప్పులూ, బాధలూ వస్తాయి
విసుగు, చీకాకు, కోపం అన్నవి కూడా ఎక్కువుగా వుంటాయి
అయితే, ఇవన్నీ ఎంతో సహనంగా భరించి తీరాలి
అంతేకాకుండా
భౌతికంగా ఆకలి కూడా ఎక్కువుగా వేస్తుంది .. కనుక, ఎక్కువుగా తినాలి

ఈ నొప్పులు ధ్యానంలో వున్నంత సేపే వుంటాయి
కనుక, డాక్టర్ల దగ్గరకు పోరాదు మందులు వాడరాదు
నాడీమండలశుద్ధి సంఫూర్ణంగా పూర్తి అయిన తరువాతే
దివ్యచక్షువు యొక్క ఉత్తేజితం జరుగుతుంది