నాలుగు యోగాలు

 

ప్రతి జీవీ
తన పరిణామక్రమంలో
అన్ని దశలనూ విధిగా దాటాల్సిందే

“భక్తియోగం” అంటే “నామసంకీర్తనం ఇత్యాది”
“కర్మయోగం” అంటే “నిష్కామకర్మ”
“జ్ఞానయోగం” అంటే “ఆత్మజ్ఞానశాస్త్ర పరిచయం”
“ధ్యానయోగం” అంటే “అనుభవైక్య జ్ఞానం

“భక్తియోగం” వల్ల తమోగుణం క్షీణిస్తుంది; రజోగుణం అభివృద్ధి చెందుతుంది
“కర్మయోగం” వల్ల రజోగుణం క్షీణిస్తుంది; సత్వగుణం అభివృద్ధి చెందుతుంది
“జ్ఞానయోగం” వల్ల సత్వగుణం ప్రధానమవుతూ “నిర్గుణత్వం” కూడా అభివృద్ధి చెందుతూ వుంటుంది
“ధ్యానయోగం” వల్ల ఒకానొక సత్వగుణప్రధాని మరింత త్వరితంగా శుద్ధసత్వుడు, మరి నిర్గుణుడు అవుతాడు

కనుక,

“భక్తియోగం” ప్రాథమిక విద్యార్థులకు . . అంటే . .
ఆత్మపరంగా శైశవదశలోనూ మరి బాల్యావస్థలోనూ
ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుంది
“కర్మయోగం” మాధ్యమిక విద్యార్థులకు అంటే
ఆత్మపరంగా యువావస్థలో ఉన్నవారికి వర్తిస్తుంది
“జ్ఞానయోగం” తరువాత ఆత్మపరంగా వృద్ధావస్థలో వచ్చేదే “ధ్యానయోగం”

 

  • చివరి అధ్యాయమే ధ్యానయోగం
  • ధ్యానం వల్లనే అనుభవ జ్ఞానం – అనుభవజ్ఞానం వల్లనే ముక్తి