నిర్వాణం తర్వాత ?
“నిర్వాణం”
అంటే “దుఃఖ రాహిత్య స్థితి”
నిర్వాణం తరువాత కూడా స్థితులు వున్నాయి
తరువాత వున్నది జన్మరాహిత్య స్థితి
తదనంతరం సృష్టికర్త స్థితి
అంటే,
తనలోంచి నూతన అంశాత్మలను సృష్టించగల స్థితి
కొన్ని లోకాలనూ సృష్టించగల స్థితి
కనుక,
“నిర్వాణం” అన్నది మొట్టమొదటి స్థితి
తదనంతరం రెండు స్థితులు వున్నాయి.
అవి “పరినిర్వాణం” .. మరి “మహాపరినిర్వాణం”
నిర్వాణం పరినిర్వాణం మహాపరినిర్వాణం
దుఃఖరాహిత్యం జన్మరాహిత్యం సృష్టికర్త పదవి
ఋషి రాజర్షి/మహర్షి బ్రహ్మర్షి
అరిహంత్ బోధిసత్వ బుద్ధ
గౌతమబుద్ధుడు బోధివృక్షం క్రింద ధ్యానం పూర్తిచేసిన
తరువాత “నేను మహాపరినిర్వాణం పొందాను” అన్నాడు
* గౌతమబుద్ధుడు పొందిన అత్యున్నత మహాపరినిర్వాణ స్థితిని,
ఒకానొక బ్రహ్మర్షి స్థితిని, మనం కూడా పొందాలి .. అదే మన ధ్యేయం