నిధి చాలా సుఖమా?

 

“నిధి చాలా సుఖమా? రాముని సన్నిధి చాలా సుఖమా?” – అన్నరు
శ్రీ త్యాగరాజ స్వామి

మనిషికి ఎంత కావాలి సంపద?
రోజూ పట్టెడన్నం . . ఇంత బట్ట . . కొంత నిద్ర.

అర్ధ కామాలను మధ్యమ పక్షంలో ఉంచుకుంటూ
ధర్మమోక్షాలను ఉత్తమ పక్షంలో ఉంచడమే సదా సుఖదాయకం

ఆది శంకరాచార్యుల వారు కూడా
“అర్థం అనర్ధం భావయ నిత్యం, నాస్తి తతః సుఖలేశః సత్యం” అన్నారు
అంటే “మితిమీరిన డబ్బు అనర్థాలకు దారి తీస్తుంది ;
అందులో సుఖం లేశమాత్రమైనా లేదు” అని

అలాగే, “యల్లభసే నిజకర్మోపాత్తం, విత్తం తేన వినోదయ చిత్తం”
అని కూడా ఆయన అన్నారు;
అంటే, “కష్టపడి సంపాదించిన ధనం తో హాయిగా వినోదించు” అని

“పైసామే పరమాత్మానహీ; పర్ పరమాత్మమే పైసా హై”
అన్నది మనం ఎప్పుడూ గుర్తించుకోవాలి భక్తరామదాసుకు రాముని సన్నిధిలోనే
నిధి అక్షరాలా దొరికింది గదా.

* కనుక, కావలసింది “నిధి” కాదు “తారక రూపుని నిజతత్త్వం తెలుకోవడం”

* అది, తలపులన్నీ నిమిషమైనా నిలిపితేనే “సాధ్యం” అంటే ధ్యానం ద్వారానే.