పండితా సమదర్శినః

 

పండితా సమదర్శినః,

ధ్యాన విజయులైన వారు ప్రపంచంలో ఎలా విహరిస్తారు?

ఏ విధంగా అంటే అద్భుతమైన సమదర్శనం తో సంచరిస్తారు.

సమదర్శనం లో విహరిస్తారు.

విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని

శుని చైవ శ్వపాకే చ పండితా సందర్శినః.

అంటే ఒక బ్రాహ్మణుడు, అంటే ఒక బ్రహ్మజ్ఞాని, అందులోనూ విద్యా వినయ సంపన్నుడైనవాడు –

ప్రపంచంలో అన్ని రకాల మనుష్యలనూ సమభావం తో చూస్తాడు.

వారు ఎంతటి సాధువులైనా, ఎంతటి క్రూరులైన, ఎంతటి జ్ఞానులు అయినా, ఎంతటి మూర్ఖులైన.

పై శ్లోకంలో హస్తిని, గోవు అన్న పదాలు సాధుత్త్వానికీ, జ్ఞానత్త్వానికీ ప్రతీకలు;

అట్లాగే శుని, శ్వపాకే అన్న పదాలు అల్పత్త్వానికీ, మృగత్వానికి ప్రతీకలు.

పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ మాస్టర్లు పూర్ణ ధ్యాన విజయులు.

సంపూర్ణ జ్ఞాన సంపన్నులు కనుకనే, వారందరూ సర్వత్రా సమదర్శనం తో

సంచరించేవారు; సర్వవేళల్లో సమదర్శనం లో విహరించేవారు.

ప్రతి మనిషి యొక్క అంతిమ ధ్యేయం సమదర్శిత్వాన్ని సాధించటం –

అన్న సందేశాన్ని మనకు శ్రీ కృష్ణ పరమాత్మడు అందించాడు.

ఈ సనాతన సందేశాన్ని, సనూతనంగా మనం మన వంతుగా అందరికీ ఇద్దాం.