శాంతము లేక సౌఖ్యము లేదు
మానవాళికి సౌఖ్యం కావాలి.
మానవాళికి పరమ సౌఖ్యం కావాలి.
మానవాళికి ఎల్లప్పుడూ సౌఖ్యం కావాలి.
అయితే సౌఖ్యం దొరికేది ఎలా?
సౌఖ్యం అంటే ఏమిటి?
సౌఖ్యం అంటే శారీరక సౌఖ్యం,
సౌఖ్యం అంటే మానసిక సౌఖ్యం,
సౌఖ్యం అంటే బుద్ధి పరమైన సౌఖ్యం,
సౌఖ్యం అంటే ఆత్మ పరమైన సౌఖ్యం.
అన్ని రకాల సౌఖ్యాలూ కేవలం ఒక్కదాని మీదే ఆధారపడి ఉన్నాయి.
– శాంతం అంటే మనస్సు యొక్క శాంతి –
– అందుకే శ్రీ త్యాగరాజస్వామి అన్నారు –
శాంతము లేక సౌఖ్యము లేదు.
శాంతం సౌఖ్యానికి మూలమైతే పరమ శాంతం పరమ సౌఖ్యానికి మూలం.
పరమ శాంతమే సదా సౌఖ్యము కలిగించేది.
శాంతం అన్నది – మనస్సు యొక్క శాంతం అన్నది – ధ్యానం ద్వారానే సంభవం.
పరమ శాంతం అన్నది – మనస్సు యొక్క పరమ శాంతం అన్నది – మరి పరమ ధ్యాన సాధన ద్వారానే సిద్ధం..
శాంతము = సౌఖ్యము = యోగము
పరమ శాంతము = పరమ సౌఖ్యము = పరమ యోగము.
కృష్ణుడు పరమ శాంతం పొందిన ఓ పరమయోగి.
బుద్ధుడు పరమ శాంతం పొందిన ఓ పరమయోగి.
జొరాస్టర్ పరమ శాంతం పొందిన ఓ పరమయోగి.
మహావీరుడు పరమ శాంతం పొందిన ఓ పరమయోగి.
జీసస్ క్రైస్ట్ పరమ శాంతం పొందిన ఓ పరమయోగి.
మహమ్మద్ పరమ శాంతం పొందిన ఓ పరమయోగి
శ్రీ జీసస్ క్రైస్ట్
“Peace that passeth understanding.”
అన్నప్పుడు
పరమ శాంతం గురించి ఆయన ఉద్భోధిస్తున్నాడు అన్నమాట.
దీనినే గౌతమ బుద్ధుడు మహాపరినిర్వాణం అని నిర్వచించాడు.
దీనినే శ్రీ కృష్ణుడు స్థిత ప్రజ్ఞత అని ఉద్ఘాటించాడు.
పిరమిడ్ మాస్టర్లందరూ పరమశాంతులైన వారు.
పిరమిడ్ మాస్టర్లందరూ పరమ సౌఖ్యాలను అనుభవిస్తున్నవారు.
పిరమిడ్ మాస్టర్లందరూ పరమయోగ్యులైనవారు.
శాంతము లేక సౌఖ్యము లేదు.
శాంతము లేక సౌఖ్యము లేదు అని అత్యద్భుతంగా ప్రవచించిన శ్రీ త్యాగరాజస్వామి జిందాబాద్.