ధ్యాన యుగం
“‘ధ్యానం’ అనేది ఒక అత్యంత సరళమైన ప్రక్రియ. అయితే, తరతరాల అజ్ఞానం కారణంగానే మనం దాన్ని పోగుట్టుకున్నాం. అది ఇప్పుడు మళ్ళీ స్వీకరించబడుతోంది. మనం మనం మళ్ళీ ‘ధ్యాన యుగం’ లోకి అడుగిడుతున్నాం. కనుక ధ్యానయుగాన్ని స్వాగతిద్దాం. ధ్యాన మాస్టర్లందరినీ స్వాగతిద్దాం. మానవజాతికీ, మానవ కళ్యాణానికీ మధ్య ‘మిస్సింగ్ లింక్’ ఏమంటే, అది ధ్యానమే. – మిగతావన్నీ మనకు మన జీవితంలో పుష్కలంగా వుండనే వున్నాయి.”