ఏడుకొండలవాడు

 

వేంకటేశ్వరస్వామి అంటే, “ఏడుకొండలవాడు”

“ఏడుకొండలు దాటి వెళ్ళాలి” కనుక “ఏడుకొండలవాడు”  అని లోకులు సాధారణంగా అనుకుంటూంటారు

అయితే “ఏడుకొండలు” అన్నవి ఏడు శరీరాలనూ “షట్ చక్రాలనూ, మరి సహస్రారాన్నీ” కలిపి సూచిస్తాయి

కనుక తన ఆరు చక్రాలనూ, మరి సహస్రారాన్నీ పూర్తిగా స్వాధీనం చేసుకుని తన ఏడు శరీరాలనూ పరిపూర్ణంగా ఉత్తేజితం చేసుకున్నవాడినే “ఏడుకొండలవాడు” అంటాం

ప్రతి పరమగురువూ ఏడుకొండలవాడే .. ప్రతి ధ్యానీ చివరికి అయ్యేది “ఓ ఏడుకొండలవాడు” గానే

* 1500 సంవత్సరాలుగా యోగస్థితిలో వుంటూ ఇప్పటికీ తిరుమల కొండల్లో మన మధ్య భౌతిక శరీర ధారియై వుండి మార్గదర్శియై, మనల్ని అందరినీ ఎంతగానో అలరారిస్తున్న  ఓ మహాయోగిపుంగవుడే ఓ ఏడుకొండలవాడే వేంకటేశ్వరస్వామి