ఏర్పేడు స్వామి
ఆధునిక కేరళ రాష్ట్ర యోగులలో ప్రప్రథముడు శ్రీ నారాయణ గురూజీ.
ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుడై, యోగియై, అది చాలదన్నట్లు సాంఘిక విప్లవాన్ని కూడా కేరళ రాష్ట్రంలో తీసుకువచ్చిన విప్లవకారుడు ఆయన.
ఆయన దగ్గర అన్నీ చేర్చుకుని, అదే విధంగా ఆంధ్రరాష్ట్రంలో ఆధ్యాత్మిక సంచలనాన్నీ, సాంఘిక విప్లవాన్నీ సృష్టించిన మహాత్ముడే శ్రీ ఏర్పేడు స్వామి, లేక శ్రీ మళయాళ స్వామి.
నిజమైన ఆధ్యాత్మికత అన్నది తప్పుడు సాంఘిక ఆచారాలకూ, మరి బూజు పట్టిన మూఢ అభిప్రాయాలకు ఎప్పుడూ గొడ్డలి దెబ్బే కదా.
ధ్యానమే మూలం ఆధ్యాత్మికతకు అని పన్నెండు సంవత్సరాలు తిరుమల కొండల్లో ధ్యాన సాధన చేసి చూపించాడు ఈ స్వామి జగత్తుకంతటికి.
ఆ మహాత్ముని అడుగుజాడలే, అ ఋషి అడుగు జాడలే పిరమిడ్ మాస్టర్లందరికీ గొప్ప స్ఫూర్తినీ, ఉత్సాహాన్నీ ఇచ్చేది – విశేషంగా తిరుపతి పిరమిడ్ మాస్టర్లకు.
ఆయనకెంత మహదానందంగా వుందో పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మాస్టర్ల యొక్క ఆధ్యాత్మిక ఉధృతాన్ని చూస్తూంటే.
ఆయనకు మన అందరి సహస్ర కృతజ్ఞాతాభివందనాలు.