ఓషో రజనీష్

 

ఓషో…

వారెవా, వాట్ ఎ గ్రేట్ మాస్టర్.

రజనీష్ పుస్తకాలు చదివితేనే జీవితం.

అవే వినోదం – మహావినోదం

అవే ఆనందం – మహాఆనందం

అవే జ్ఞానం – మహావిజ్ఞానం

ప్రపంచంలో వున్న ఎందరెందరో జ్ఞానుల గురించీ,

వారి సహజ జీవిత విధానాల గురించీ,

దివ్య ధ్యానానుభవాలను గురించీ,

పరిధి లేని ఆత్మవికాసం గురించీ,

వేలకొద్దీ చిరు జ్ఞానకథలనూ,

చిన్నిచిన్ని కథానికలనూ ఉదహరిస్తూ “న భూతో న భవిష్యతి” అన్న విధంగా సుమారు 650 పుస్తకాల్లో విస్తృతంగా విశ్లేషించిన అద్భుత జ్ఞాని ఓషో రజనీష్.

  • నూతనంనిస్సంకోచంనిర్భయంనిత్యానందమయంఅయిన జీవనశైలిని దివి నుంచి భువికి దించ సాహసించిన దివ్యమూర్తి ఓషో రజనీష్
  • ఓషో రజనీష్” అంటేనే దురభిప్ర్రాయం పెట్టుకున్నవారుఆయన పుస్తకాలేవీ చదవకుండానే ఆయనను నిందించేవారుమహాముదనష్టపు జాతకులు.