కన్‌ప్యూషియస్

 

కన్‌ప్యూషియస్

6 వ శతాబ్దం B.C. నాటి

చైనా దేశపు మహాజ్ఞాని

“మీ దేశం గొప్పతనాన్ని ప్రపంచానికి చూపించాలి అంటే, ముందుగా రాష్ట్రలను చక్కబెట్టాలి;

రాష్ట్రాలను చక్కబెట్టాలి అంటే ముందుగా కుటుంబాలను కుదుటపరచాలి;

కుటుంబాలు కుదుటపడాలి అంటే ముందుగా ‘వ్యక్తిగత జీవితం’ సరిదిద్దబడాలి;

వ్యక్తిగత జీవితం సరిదిద్దబడాలి అంటే ముందుగా వ్యక్తి తన ‘బుద్ధిమాంద్యం’ పోగొట్టుకోవాలి;

బుద్ధిమాంద్యం పోవాలి అంటే ముందుగా ‘శ్రద్ధ’, ‘దీక్ష’ అన్నవి అవసరం;

శ్రద్ధ, దీక్ష అన్నవి కుదరాలి అంటే ‘జ్ఞాన విస్తరణ’ అవసరం;

జ్ఞాన విస్తరణ జరగాలి అంటే, ‘అన్నింటిని పరిశోధించడం’ అన్న ప్రక్రియ తప్పనిసరి” – అన్నాడాయన.

  1. “వస్తుతత్వ పరిశోధన ద్వారానే జ్ఞాన విస్తరణ జరుగుతుంది”
  2. “జ్ఞాన విస్తరణ ద్వారానే శ్రద్ధ, దీక్ష అన్నవి అకుంఠితమవుతాయి”
  3. “శ్రద్ధ, దీక్ష అన్నవి అకుంఠితమవ్వడం ద్వారానే బుద్ధిమాంద్యం పోతుంది”
  4. “బుద్ధిమాంద్యం పోవడం ద్వారానే వ్యక్తిగత జీవితం సరిదిద్దబడుతుంది”
  5. “వ్యక్తిగత జీవితాలు సరిదిద్దబడడం ద్వారానే కుటుంబాలు కుదుటబడతాయి”
  6. “కుటుంబాలు కుదుటపడడం ద్వారానే రాష్ట్రాలు చక్కబడతాయి”
  7. “రాష్ట్రాలు చక్కబడడం ద్వారానే దేశం గొప్పగా అవుతుంది”
  8. “అప్పుడే మీ దేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటగలరు”
  • ఈ ఎనిమిది అంశాల సారాన్నేది గ్రేట్ లెర్నింగ్” అంటే “మహాజ్ఞానం” అని చైనాలో అంటారు.