కర్మబద్ధుడు
కర్మలు
చేసే తీరాలి.
అకర్ముడిగా ఎప్పుడూ వుండరాదు.
ఓడిపోతామని తెలిసినా సరే.
మొదట్లో అపజయం కలిగినా,
“అపజయం కూడా విజయ పరంపరలోని ఒక మెట్టే” అని గ్రహించాలి.
కర్మలు చేసే తీరాలి.
ధర్మాధర్మాలు సరిగ్గా తెలియకపోయినా సరే.
కర్మబద్ధుడైనవాడికి
ధర్మాధర్మ జ్ఞానం క్రమక్రమంగా తప్పక కలుగుతుంది.
ప్రతి ఒక్కడూ కర్మలు చేస్తూనే వుండాలి.
“మా తే సంగోస్త్వకర్మణి” అని కదా అన్నాడు గీతాకారుడు.
సోమరిగా, తమోగుణిగా,
అకర్ముడిగా ఎవ్వరూ, ఎప్పుడూ ఉండరాదు.
‘రేపు’ అని ఎవ్వరూ, ఎప్పుడూ అనరాదు.
కర్మబద్ధుడు ఎప్పుడూ అగ్రజుడే
అకర్ముడు ఎప్పుడూ చిట్ట చివరివాడే.