ఆస్తికులు – నాస్తికులు
“ఆస్తికులు”
అంటే “‘ఆస్తి’” అనేవారు”.
‘ఆస్తి’ అంటే ‘వున్నది’ అని అర్థం
ఏమిటి వున్నది అని ?
“మరణానంతర జీవితం” వున్నదనీ;
“దైవ పదార్థం” వున్నదనీ;
“ఈ ఉన్నదంతా అదే” అనీ;
“సృష్టి క్రమంలో నిర్ధిష్టమైన ప్రణాళిక, ప్రయోజనం అన్నవి వున్నాయి” అనీ
న + అస్తి = నాస్తి :
“ఇవన్నీ లేవు” అంటే “నాస్తి” అనే వారే “నాస్తికులు”
- ‘లేవు’ అనేవారు ఎప్పుడూ వున్నదాన్ని చూడలేరు, పొందలేరు,
- ‘ఉన్నది’ అనే వారు వున్నదాన్ని చూడగలరు, పొందగలరు.