కృష్ణ
చేయవలసినదాన్నంతా చేసి
అనుభవించవలసినదాన్నంతా అనుభవిస్తున్నవాడే ” కృష్ణుడు “
తెలుసుకోవలసినదాన్నంతా తెలుసుకుని
పొందవలసిన ఫలాలను హాయిగా అనుభవిస్తున్నవాడే
ఏ “కృష్ణుడు” అయినా ..
“కృ” = చేయటం
“ష్ణ” = తినటం
ఏమిటి చెయ్యాలి ?
మనల్ని మనం తెలుసుకోవడం చెయ్యాలి !
తనను తాను పూర్ణంగా తెలుసుకున్నవాడే “కృష్ణుడు”
తనకు తాను సంపూర్ణంగా తెలుసుకున్నవాడే “పురుషోత్తముడు”
తనకు తాను ఆత్మగా తెలుసుకున్నవాడే “నారాయణుడు”
చేయవలసినవి చేస్తేనే
పొందవలసినవి పొందుతాం
చేయకూడనివి చేస్తే
పొందకూడనివి పొందుతాం
చేసుకున్నవాడికి చేసుకున్నంత మహదేవా !
* ఒకానొక దేవకీపుత్రుడు “కృష్ణుడు” అయ్యాడు
ఇక మనమంతా కూడా “కృష్ణులు” గా కావాలి