సరియైన నడవడిక
“లేనిది కోరరాదు, ఉన్నది కాదనరాదు ;
వస్తూంటే ‘వస్తోంది’ అని సంబరపడరాదు ;
పోతూంటే ‘అయ్యో, పోతోంది’ అనరాదు”
– శ్రీ సదానంద యోగి
“కోరి సాధించరాదు,
కోరక వచ్చింది కాదనరాదు”
– శ్రీ సదానంద యోగి
ఈ ప్రాపంచిక లోకంలో ఒక జ్ఞాని
ఎలా విహరిస్తాడో, ఎలా విహరించాలో వివరించి చెప్పేదే
ఈ “సరియైన నడవడిక” సూత్రం
అందుకే గీతాకారుడు అన్నాడు :
“కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన”
“కర్మలు చేయడానికి మాత్రమే మనకు
అధికారం వుంది; అంతేకానీ,
వాటి ఫలం ‘ఇలా వుండాలి’, ‘అలావుండాలి’
అని ఆశించడం సరికాదు” అని
* ప్రాపంచికంగా ఎక్కువుగా ఆశించకుండా జీవించడమే ఆధ్యాత్మికత
* ప్రాపంచికంగా ఏది వస్తున్నా, ఏది పోతున్నా ఎంతమాత్రం
చలించకుండా జీవించగలగడమే సంపూర్ణ ఆత్మజ్ఞానసారం