ఆత్మచైతన్యం
“రామాయణాన్ని మూడు ముక్కలలో ‘కట్టె, కొట్టె, తెచ్చ’ అని ప్రజలు చెప్పుకోవడం పరిపాటి … ‘కట్టె’ అంటె శరీరాన్ని కట్టివేయడం, ‘కొట్టె’ అంటే మన ఆలోచనలను కొట్టివేయడం, ‘తెచ్చె’ అంటే ధ్యానం చేసి విశ్వశక్తిని తెచ్చుకోవడమే.”
“‘ధ్యానం’ అంటే విశ్వశక్తి ఆవాహనం చేసి, నాడీమండల శుద్ధి కలిగి, దివ్యచక్షువు ఉత్తేజితమై, సూక్ష్మశరీరయానం చేయడం క్రమక్రమంగా ఆత్మజ్ఞానం కలిగి, ఆత్మారాముని పూర్ణంగా కనుగొనడం.”
“ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ ధ్యానం చేయాలి. ఊహ తెలిసిన వయస్సు నుంచే పిల్లలు ధ్యానం మొదలుపెట్టాలి. విద్యార్ధులు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు కూడా ప్రతిరోజూ … ఎవరికి ఎంత్ వయస్సు వుంటే అన్ని నిమిషాలు … ఒక సిట్టింగ్‌లో ప్రతిరోజు ధ్యానం చేయడం వల్ల సర్వరోగాల నుంచి విముక్తులు కావడమే కాకుండా, అసలు జబ్బులు లేకుండా, రాకుండా జీవించవచ్చు.”
పదివేల సంవత్సరాల క్రితం ఈజిప్ట్‌లో పిరమిడ్‌లు నిర్మించారనీ, అవి అద్భుత విశ్వశక్తి ఆవాహన్ క్షేత్రాలు అని ప్రయోగాత్మకంగా తెలుసుకున్న తాము ధ్యానానికి పిరమిడ్‌ను జోడించి అందరితో ధ్యానం చేయిస్తున్నాం.
“అనవసరమైన మాటలు మాట్లాడి ఎనర్జీని వృధా చేసుకోరాదు. మనలోని శక్తితో మంచి మాటలు మాట్లాడి, మంచి పనులు చేయడానికి ఉపయోగించాలి. ధ్యానం చేసి మరింత కాస్మిక్ ఎనర్జీని ప్రతిఒక్కరూ పొంది అమిత శక్తివంతులు అవ్వాలి. ఆత్మవంతులు కావాలి. ఎవరు ధ్యానం చేస్తారో వారు ‘ఆత్మచైతన్యం’ లో వుంటారు. ఎవరు ధ్యానం చేయరో మనస్సులోనే వుంటారు. బుద్ధితో వుండరు.”
“మనస్సువత్ మనిషి రావణాసురుడు. ఆత్మవత్ శ్రీరాముడు. మనస్సుతో రావణుడు సీతను ఎత్తుకుపోతే ఆత్మతో రాముడు రావణాసురుని చంపి సీతను తెచ్చుకుంటాడు. అంజనేయస్వామి ద్వారానే రామునికి సీత జాడ తెలిసినట్లు. శ్వాస ద్వారానే ప్రతి వ్యక్తి ఆత్మారాముడిని తనలోనే కనుగొంటాడు. మనస్సువత్ కిష్కిందకాండ … ధ్యానసాధనావత్ సుందరకాండ. వాల్మీకి రామాయణంలో ధ్యానం గురించి విస్తారంగా చెప్పి వున్నాడు.”
“ధ్యానం వల్ల ప్రతి వ్యక్తీ ఆత్మారాముడవుతాడు. నారాయణుడు అవుతాడు. నలభైరోజులు ధ్యానం చక్కగా చేస్తే ప్రతి వ్యక్తీ ఎన్‌లైటెన్ అవుతాడు. మన దగ్గర కాస్మిక్ T.V. వుంది. ‘థర్డ్ ఐ’ అంటే అదే. ‘థర్డ్ ఐ’ వల్ల మొత్తం సృష్టి అంతా మరి భూత, భవిష్యత్ వర్తమానాలన్నీ తెలుస్తాయి.”