ఆత్మజ్ఞానం – బ్రహ్మజ్ఞానం

 

“ఆత్మజ్ఞానం” అంటే “ఆత్మ గురించి జ్ఞానం”
అంటే, మన గురించి మనం తెలుసుకోవడం
“నేను భౌతిక శరీరం మాత్రమే కాదు, ఆత్మను కూడా” అని తెలుసుకోవడం
“నేను మూల చైతన్యం” అని తెలుసుకోవటం
ఇదంతా ధ్యానం ద్వారా మాత్రమే మరి సాధ్యం

ఆత్మజ్ఞానం అన్నది “తొలిమెట్టు” అయితే, బ్రహ్మజ్ఞానం అన్నది “తుదిమెట్టు”
“బ్రహ్మజ్ఞానం” అంటే “సకల చరాచర సృష్టి రహస్యాల యొక్క జ్ఞానం”
కోటానుకోట్ల లోకాల గురించి వీలయినంత సుస్పష్ట విజ్ఞానం

“ఆత్మజ్ఞానం” లేనిదే “బ్రహ్మజ్ఞానం” అన్నది అసంభవం
ఒకానొక ఆత్మజ్ఞానిని “ఋషి” అంటాం .. “ద్రష్ట” అంటాం
ఒకానొక బ్రహ్మజ్ఞానిని “బ్రహ్మర్షి” అంటాం

స్వంత పూర్ణ నిజ స్థితిని తెలుసుకున్నవాడు ఒకానొక “ఆత్మజ్ఞాని”
బయటి ప్రకృతిని పూర్ణంగా అర్థం చేసుకున్నవాడే ఒకానొక “బ్రహ్మజ్ఞాని”

బ్రహ్మజ్ఞాని అయినప్పుడే ‘ బ్రహ్మ పదవి ‘ లభిస్తుంది
“బ్రహ్మ” అంటే “సృష్టికర్త – Creator” అని
అతను కొన్ని ఆత్మలనూ, కొన్ని లోకాలనూ సృష్టి చేయగలవాడు
సకల లోక జ్ఞాని అయినవాడే నూతన లోకాలను సృష్టించగలడు ..
“సహసృష్టికర్త – Co-Creator” కాగలడు

ఆత్మజ్ఞానం అన్నది ధ్యానం ద్వారా లభించే దివ్యచక్షువు యొక్క ప్రాథమిక స్థితి
బ్రహ్మజ్ఞానం అన్నది దివ్యచక్షువు యొక్క పరమ పరిపక్వతా స్థితి