ఆత్మజ్ఞానం పొందని జీవితం వృధా
ప్రతి వ్యక్తి నోటివెంట ప్రాపంచిక వాక్కులు కాకుండా ఆధ్యాత్మిక వాక్కులురావాలి.
అందరికీ నోరు వున్నప్పటికీ బకాసురుడిలా కాకుండా బుద్ధుడిలా జీవించాలి.
సాధన ద్వారానే ఆత్మజ్ఞానం వస్తుంది. అందుకోసం ప్రతిఒక్కరూ ధ్యానసాధన చేయాలి. సంగీతం రాకపోతే గొంతు, ఆత్మజ్ఞానం లేకపోతే జీవితం వృధా. ‘నేనే ఆత్మ’ అని తెలుసుకోవడమే జీవితాన్ని సార్ధకం చేసుకోవడం. శ్వాసానుసంధానం ద్వారానే ఆత్మానుభవం సాధ్యం; మనకు అత్యంత దగ్గరలో వున్న ప్రకృతి శ్వాసే ;ప్రకృతిలో విలీనం చెందడం అంటే శ్వాసలో విలీనం చెందడమే.