ఆత్మా దృశ్యతే సూక్ష్మదర్శిభిః
“ఏష సర్వేషు భూతేషు గూఢోత్మాన ప్రకాశతే
దృశ్యతే త్వగ్ర్యయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభిః”
= కఠోపనిషత్(3-12)
సర్వేషు | = | అన్ని |
భూతేషు | = | జీవులలో |
గూఢః | = | దాగివున్న |
ఏషః | = | ఈ |
ఆత్మా | = | ఆత్మ |
నప్రకాశతే | = | ప్రకాశించదు (అందరికీ) |
సూక్ష్మదర్శిభిః | = | సూక్ష్మవిషయాలను దర్శించగలిగే ఋషుల చేత |
అగ్ర్యయా | = | తీక్షణమైన, ఏకాగ్రమైన |
బుద్ధ్యా | = | బుద్ధిచేత; (ఏషః ఆత్మా = ఈ ఆత్మ) |
తు | = | కానీ |
దృశ్యతే | = | సాక్షాత్కరింపబడుతుంది |
-
“అన్ని జీవులలోనూ గుప్తమైవున్న ఈ ఆత్మ అందరికీ ప్రకటితం కాదు; సూక్ష్మదర్శులైన ఋషులు మాత్రమే తీక్షణమైన, ఏకాగ్రమైన తమ బుద్ధి ద్వారా ఈ ఆత్మను సాక్షాత్కరించుకోగలరు”
(=రామకృష్ణ మిషన్ ప్రచురణ)