అధర్మయుక్తమైన కర్మలు?

 

ఒకవేళ గనుక,
అధర్మయుక్తమైన కర్మలైనా “చేయాలి” అని
విపరీతంగా అనిపిస్తే చేసేతీరుతాం

ఇది రజోగుణ సంబంధమైనది;
ఒకానొక వ్యక్తికి ఇది కూడా అవసరం కావచ్చు
ఇది కూడా తీర్చుకునే తీరాలి . .
అప్పుడే అభివృద్ధి . .
మరి అప్పుడే ముందుకు వెళతాం

అందుకే వేమన యోగి అన్నాడు;

“కామిగాక మోక్షగామి కాడు” అని
కోరికలు తీర్చుకోవడంలో ఉద్యుక్తుడైన వాడే “కామి”

  • ఆ కామిమొదట కామిగా మారాలి
    ఒకవేళ దుష్కామిఅయితే క్రమక్రమంగా
    ఆ యా పాఠాలు నేర్చుకోవడం ద్వారాఅచిరకాలంలో,
    సత్యకామి‘ గా అయితీరుతాడు