అహమేవ శరణం మమ
“భక్తియోగం” లో
మామూలుగా మనం వింటూ వుంటాం
“త్వమేవ శరణం మమ” అని
అంటే
“నీవే నాకు దిక్కు” అని
ఈ స్థితి మనలను నిర్వీర్యులుగా చేస్తుంది
ఎప్పుడూ “త్వమేవ” “త్వమేవ” అంటూ వుండడం
మన గోతిని మనమే త్రవ్వుకోవడం లాంటిది
అయితే “త్వం” అన్న పదం చోట “అహం” అన్న పదం చేర్చుకోవాలి
ఎప్పుడూ “అహమేవ శరణం మమ” అనుకోవాలి
అంటే, “నాకు నేనే శరణు” అని ..
ఇదే సరియైన జీవన జ్ఞాన దృక్పథం
* “భక్తి రోగం” అన్నది “త్వమేవ శరణు” అంటుంది
“ఆత్మయోగం” అన్నది “అహమేవ శరణు” అంటుంది
* అంటే “నాకు నేనే దిక్కు” అన్నమాట