ధ్యాన లోకం
భూలోకం అతి త్వరలో ధ్యానలోకం కాబోతుంది.
ఇది భవిష్యత్ వాణి ; ఇది ఋషి దర్శనసారం.
భూలోకం ధ్యానలోకం కావాలంటే ప్రతి దేశమూ, ప్రతి రాష్ట్రమూ, ప్రతి గ్రామమూ ధ్యాన మయం కావాలి.
అందుకోసమే ఆవిర్భవించాయి – పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ ఇండియా.
ప్రతి పట్టణం ధ్యాన పట్టణం గా విలసిల్లాలంటే ప్రతి పట్టణంలోని ప్రతి బాలుడు, బాలిక, యువకుడు, యువతి, వృద్ధుడు, వృద్ధురాలు – అందరూ కూడా ధ్యానమయులుగా కావాలి. అందుకోసమే కంకణం కట్టుకున్నాయి పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ ఇండియా.
ఇక ఏ పట్టణంలోనూ పామరులు ఉండరాదు –
ఆత్మ జ్ఞానులే ఉండాలి – పండిత శ్రేష్ఠులే ఉండాలి . అది అందరూ ఆనాపానసతి విపస్సన ధ్యాన మార్గం అవలంభిస్తేనే సాధ్యం.
అందరికీ ఆనాపానసతి – విపస్సన ధ్యాన మార్గం బోధించడం కోసమే ఆవిర్భవించాయి పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ ఇండియా.
ఆనాపానసతి – విపస్సన ధ్యాన మార్గమే వాస్తవానికి మునుపటి కృష్ణ ప్రభోధం, మహావీర ప్రభోధం, బుద్ధ ప్రభోధం, ఆదిశంకర ప్రభోధం; అదే మన వర్తమాన ప్రభోధం.
సత్యం అనేక రకాలుగా ఎప్పుడూ ఉండదు . అదెప్పుడూ ఏకరీతిలోనే ఉంటుంది. ఉన్న ఒక్కగానొక్క సత్యమార్గాన్ని అందరికీ ప్రభోధించడమే పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ ఇండియా వారి ఏకైక ధ్యేయం.