ధ్యానధార … ఆకాశ గంగాధార

 

ధ్యానం…అంటే శ్వాస మీద ధ్యాస.

ధ్యానం … అంటే … శ్వాస ధార మీద ధ్యాస ధార.

శ్వాస మీద ధ్యాస ద్వారా చిత్తవృత్తి నిరోధం.

చిత్తవృత్తి నిరోధం అంటే ఒక అఖండ శూన్యధార.

జీవితం అంతా ఒక ధ్యానధారకావాలి.

ధ్యాన ధార ద్వారా ఒకానొక ప్రాణశక్తిధారను సంపాదిస్తాం.

ధ్యాన ధార ద్వారానే విశ్వమయ ప్రాణశక్తి ధార లభ్యం.

విశ్వమయ ప్రాణశక్తి ధార అంటే … ఆకాశగంగాధార.

‘ఆకాశ గంగా ధార’ ద్వారా ప్రతి మనిషి ఒక గంగాధరుడుఅవుతాడు.

‘గంగాధరుడు’ అయినవాడు అనతికాలంలోత్రినేత్రుడుఅవుతాడు.

ప్రతి త్రినేత్రుడూ ఒకానొక పరమశివుడే.

శివం అంటే ‘ఆనందం’.

‘త్రినేత్రం’ ద్వారా పరమశివం… అంటే పరమఆనందం.

ప్రతి సగటు మానవుడు ఒకానొక పరమశివుడుగా తప్పనిసరిగా కావలె.

శ్వాస మీద ధ్యాస

శ్వాస ధార మీద ధ్యాస ధార

శ్వాస ధార మీద ధ్యాస ధార … అదే ధ్యాన ధార

ధ్యాన ధార ద్వారా ప్రాణశక్తి ధార

శక్తి ధార ద్వారా ఆనంద ధార