ధ్యానం ద్వారానే ఆత్మజ్ఞానం
ధ్యానం ద్వారానే ఆత్మజ్ఞానం సాధించవచ్చు.
ధ్యానం అంటే మనిషి హయిగా జీవించవచడానికి ఉపయోగపడే సాధనం.
మనమందరం జీవించాలన్నా, పాడుకోవాలన్నా హయిగా మాట్లాడాలి. అందరూ కలసిమెలసి ఉండాలి.
మనిషి హాయిగా జీవించాలంటే రెండే రెండు పాటించాలి 1.అహింస 2.ధ్యానం. ‘అహింస’ అంటే ఎవ్వరినీ హింస చేయకుండా ఉండటం. సకల ప్రాణికోటిని హయిగా జీవించేటట్లు చేయవలె.ఎదుటి ప్రాణిని హింసిస్తే నువ్వు హయిని కోల్పోతావు. కనుక ఏ చేపనూ, ఏ పీతనూ, ఏ రొయ్యనూ చంపరాదు. ఏ మనిషినీ మటల ద్వారా, చేష్టల ద్వారా హింసపెట్టరాదు.
రెండవది ధ్యానం అంటే మనస్సును శూన్యం చేయడం. మనస్సు శూన్యం అయినప్పుడు మూడవకన్ను…. దివ్యచక్షువు…ఉత్తేజితం అవుతుంది. దివ్యచక్షువు ఉత్తేజితం ద్వారా “నేను శరీరం కాదు, ఆత్మ అనీ, ఈ ఆత్మ పదార్ధమే సర్వత్రావ్యాపించి ఉంది అని తెలుసుకుంటాం. ఆత్మజ్ఞానం కలిగిన తరువాత ఎవ్వరినీ హింసపెట్టరు.కనుక ప్రతి మనిషి హాయిగా జీవించాలంటే అహింస,ఆత్మజ్ఞానం తప్పనిసరిగా పొందాలి”.
హాయిగా ఉండడం అంటే అహింసను పాటించాలి, ధ్యానం అలవరచుకోవాలి. ధ్యానం ద్యారా ఆత్మజ్ఞానం కలుగుతుంది, ఆత్మజ్ఞానం వచ్చిన తరువాత ఆత్మే దైవపదార్ధం అన్న అనుభవం కలుగుతుంది;ఈ ఆత్మపదార్ధం సర్వత్రా వ్యాపించి ఉంది అని తెలుసుకుంటాం.
ఒకానొక ధ్యాని మాత్రమే జీవింతంలో ఏ పరిస్థితిలోనైనా సరే, ఏ ప్రాణికైనాసరే హాని చేయకుండా జీవించగలుగుతాడు.
నిత్యజీవితంలో ప్రతి మనిషీ ఎన్నో ఒడిదుడుకులు, సమస్యలు ఎదుర్కొంటున్నాడు. రోజులో కనీసం ఒక గంటైనా ధ్యానం చేయకపోతే జీవితం హాయి లేకుండా వృధా అవుతుంది.
ధ్యానం వల్ల శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరకడమే కాకుండా మనిషి కూడా హాయిగా సంతోషంగా ఉండవచ్చు. ధ్యానం ప్రతి మనిషి జీవితంలో క్రొత్తహాయిని నింపుతుంది.