ధ్యానం వలన లాభాలు

 

 

ధ్యానం ద్వారా

మనకు ఆరు విధాల లాభాలు చేకూరుతాయి:

అవి,

1) శారీరక ధారుడ్యం

2) మానసిక ప్రశాంతి

3) బుద్ధి సునిశిత

4) ఆర్ధిక సంక్షేమం

5) సుమిత్ర ప్రాప్తి

6) ఆధ్యాత్మిక విజ్ఞానం

“ధ్యానయోగం” అన్నది తెలియని వారికి

ఆధ్యాత్మిక సత్యాలు దృగ్గోచరం కావడం అన్నది అసంభవం;

కనుక, వారు అనేక విధాల ప్రమత్తులై వుంటారు

పర్యవసానం –

ఏ విధమైన స్వస్థతా వాస్తవానికి వారికి వుండదు.

  • ధ్యానులు కాని వారికి శారీరక దుర్బలత, మానసిక అశాంతి, ఆధ్యాత్మిక అజ్ఞానం అన్నవి తప్పవు
  • ధ్యానులు కానివరికి ‘సుమిత్ర శూన్యత’, అంటే ‘సంఘంలో మంచి మిత్రులు లేకపోవడం’అన్నది వుంటుంది
  • ధ్యానులు కానివారికి “ఆధ్యాత్మిక అజ్ఞానం”, అంటే “మనం ఎవరమో, ఎందుకు జీవిస్తున్నామో అన్నది బొత్తిగా తెలియకపోవడం” , అన్నది తప్పదు