ధ్యాస జగత్

 

శ్వాస .. మీద ధ్యాస .. ధ్యాన యోగం

మాట .. మీద ధ్యాస .. బుద్ధియోగం

అహింస .. మీద ధ్యాస .. కరుణ యోగం

ఆత్మవిశ్వాసం .. మీద ధ్యాస .. ప్రగతి యోగం

అత్మార్పణం .. మీద ధ్యాస .. భక్తి యోగం

సత్యం .. మీద ధ్యాస .. జ్ఞాన యోగం

శాస్త్రీయ దృక్పధం .. మీద ధ్యాస .. విజ్ఞాన యోగం

కర్తవ్యం .. మీద ధ్యాస .. ధర్మ యోగం

గురువాక్యం .. మీద ధ్యాస .. శిష్య- ధర్మ యోగం

అనునిత్య ప్రశిక్షణ .. మీద ధ్యాస .. గురు-ధర్మ యోగం

పరస్పర సహకారం .. మీద ధ్యాస .. సంఘ-ధర్మ యోగం

పరిసరాల పరిశుభ్రత .. మీద ధ్యాస .. పౌర-ధర్మ యోగం

వ్యక్తి న్యాయం .. మీద ధ్యాస .. రాజ-ధర్మ యోగం

భూతదయ .. మీద ధ్యాస .. కరుణా-ధర్మ యోగం

అనుభవాల పరంపర .. మీధ ధ్యాస .. ఆత్మధర్మ యోగం

దుఃఖరాహిత్యం .. మీద ధ్యస .. బుద్ధ యోగం

చేపట్టిన పని .. మీద ధ్యాస .. కర్మ యోగం

యుక్తాహారం .. మీద ధ్యాస .. ఆరోగ్య యోగం

సకలప్రాణికోటితో మిత్రత్వం .. మీద ధ్యాస .. మైత్రేయ-బుద్ధ యోగం

“ధ్యాస – మూలం – ఇదం – జగత్”