అంశాత్మ – పూర్ణాత్మ
మనం “అంశ” ఆత్మలం మనం అంతా “ఋషిపుత్రులం” మనం అంతా “క్రింద” వున్న ఆత్మలం
“సత్యలోకాలలో” అంటే “మహాకారణలోకాలలో” వున్న “ఒకానొక ‘పూర్ణాత్మ’ యొక్క ఒకానొక అంశ” మనం అన్నమాట “అంశాత్మ” .. “పూర్ణాత్మ”
ఎప్పుడైతే మనం పూర్తిగా ఆత్మ పరిణితి చెందుతామో, అప్పుడు మనం కూడా ఆ మహాకారణలోకాలను చేరుతాం అప్పుడు మనం కూడా మనలో నుంచి నూతన అంశాత్మలను సృష్టి చేస్తాం అంటే, మనమూ “పూర్ణాత్మ” స్థితి చేరుతామన్నమాట
ముండకోపనిషత్‌లో ఈ విధంగా వుంది : “ద్వా సుపర్ణా సయుజా సఖాయా సమానం వృక్షం పరిషస్వజాతే తయోరన్యః పిప్పలం స్వాద్వత్త్యనశ్నన్నన్యో అభిచాకశీతి || ” (3.1.1)
“రెండు పక్షులు .. అంటే అంశాత్మ, పూర్ణాత్మ ఎప్పుడూ ఒకే చెట్టుమీద .. అంటే శరీరం మీద .. కలిసి ఉంటాయి రెండూ అందమైన ఈకలతో ఒకే రకంగా ఉంటాయి వాటిలో ఒకటి తియ్యటి పండ్లను తింటుంది రెండవది దేనినీ తినకుండా ఊరకనే చూస్తూ కూర్చుని ఉంటుంది “
* ధ్యానంలో పరాకాష్ట అంటే మన పూర్ణాత్మతో అనుసంధానం కలిగి వుండడం * “పూర్ణాత్మ” అంటే “ద్వా సుపర్ణా” అనే ఋగ్వేద వాక్యాలలో వున్న “రెండవ పక్షి” అంటే “పైన వుండే పక్షి” అన్నమాట