అక్షరాభ్యాసం
“అ” + “క్షరం” = ” అక్షరం “
“క్షరం” కానిది “అక్షరం”
“క్షరం” అంటే “నశించేది”
“అక్షరం” అంటే “నశించనిది” అని అర్థం
“చైతన్యం” అంటే ” ‘నేను’ అనే ఆత్మపదార్థం”
“చైతన్యం” అన్నదే “అక్షరం” .. అంటే “నశించని వస్తువు”
“మనం చేతనామయ ఆత్మలం” – అన్న సత్యాన్ని
ఎప్పుడూ అభ్యాసంలో ఉంచుకోవడమే
“అక్షరాభ్యాసం” అన్నమాట
“అక్షరాభ్యాసం” అంటే “అక్షరాన్ని అభ్యాసం చేయడం”
“అక్షరాభ్యాసం” అంటే ” ‘నేను ఆత్మను’ అన్న సత్యాన్ని
దైనందిన భౌతిక జీవితంలో అభ్యాసం చేయటం”
- ధ్యానం ద్వారానే మరి “అక్షరాభ్యాసం” అన్నది జరుగుతుంది
- ధ్యానంలో జరిగే ఆత్మానుభవ కృషియే “అక్షరాభ్యాసం”
- అక్షరాభ్యాసానికి ‘ఆది‘ఉంది కానీ ‘అంతం‘లేదు.
- “ఆధ్యాత్మికత” అంటే అనుక్షణ అక్షరాభ్యాసమే
- ఎవరి సాధన వారిదే .. అక్షరాభ్యాస దివ్యక్షేత్రంలో