అత్తా హి అత్తనో నాథో
ధమ్మపదంలో బుద్ధుడు ఇంకా ఇలా చెప్పాడు
“అత్తనా చోదయత్తానం, పటిమాసే అత్తమత్తనా”
– ఆత్మనాచోదయే దాత్మానం, ప్రతివసేదాత్మనమాత్మనా (సంస్కృతం)
- “శ్రవణుడా, నిన్ను నువ్వే నడిపించుకో, నిన్ను నువ్వే పరీక్షించుకో”
“సుద్ధి అసుద్ధి పచ్చత్తం, నాఞ్ఞ అఞ్ఞం విసోదయే”
– (శుద్ధి రశుద్ధిః ప్రత్యాత్మం, నాన్యోన్యం విశోదయేత్) (సంస్కృతం)
- “శుద్ధి, అశుద్ధి అనేవి తనకు సంబంధించినవే. ఒకరు మరొకరిని శుద్ధి చేయలేరు”
“అత్తాహి అత్తనో నాథో, అత్తాహి అత్తనో గతి”
– (ఆత్మాహ్యాత్యనో నాథః ఆత్మాహ్యాత్యనో గతిః) (సంస్కృతం)
- “ఆత్మకు ఆత్మే ప్రభువు; ఆత్మకు అత్మే గతి” అంటే, “ఎవరికి వారే ప్రభువు, ఎవరికి వారే గతి” అని.