భగవద్గీత 18-78
“ యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః | తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ || ” |
పదచ్ఛేదం
యత్ర – యోగేశ్వరః – కృష్ణః – యత్ర – పార్థః – ధనుర్ధరః – తత్ర – శ్రీః – విజయో – భూతిః – ధ్రువానీతిః – మతిః – మమ
ప్రతిపదార్థం
యత్ర = ఎక్కడ ; యోగేశ్వరః = యోగేశ్వరుడైన ; కృష్ణః = శ్రీకృష్ణుడు ; యత్ర = ఎక్కడ ; ధనుర్ధరః = ధనస్సును చేబట్టిన ; పార్థః = అర్జునుడు ; తత్ర = అక్కడ ; శ్రీః = లక్ష్మి (సంపద) ; విజయః = విజయం ; భూతిః = ఐశ్వర్యం ; ధ్రువా = దృఢమైన ; నీతిః = నీతి ; (సన్తి ఇతి = కలవు అని ) ; మమ = నా యొక్క ; మతిః = అభిప్రాయం
తాత్పర్యం
“ ఎక్కడ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు, ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటారో అక్కడ సంపద, ఐశ్వర్యం, విజయం, దృఢమైన నీతి ఉంటాయని నా ఆభిప్రాయం. ”
వివరణ
శ్రీకృష్ణుడు ఒకానొక జగద్గురువు ; ఒకానొక యోగేశ్వరుడు …
శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక అనుభవానికి పరాకాష్ట ;
శ్రీకృష్ణుడు ఒకానొక ఆధ్యాత్మిక శాస్త్ర జ్ఞానానికి ప్రతీక.
ధనస్సును ధరించిన అర్జునుడు ప్రాపంచిక పురోభివృద్ధి కోసం
తన సర్వ శక్తి సామర్థ్యాలను వినియోగించడానికీ … మరి
బాహ్య శత్రువులనే కాకుండా అంతః శత్రువులను కూడా నిర్జించడానికీ …
అనుక్షణం సిద్ధంగా వుండే ఒకానొక యోద్ధుడికీ …
ఒకానొక ముముక్షువుకీ ప్రతీక.
“ ఈ ఇద్దరూ ” అంటే …
సరియైన భౌతిక జీవన విధానంలో సరియైన ఆధ్యాత్మికతను మేళవించి,
మన జీవన విధానాన్ని తీర్చిదిద్దుకుంటే …
సంపద, విజయం, ఐశ్వర్యం, పటిష్టమైన నీతి నియమాలు
ప్రతి ఒక్కరి జీవితంలో వెల్లివిరుస్తాయి.
“ శ్రీ ” అంటే “ ఐశ్వర్యం ” “ ప్రాపంచిక సంపదలు ”
“ విజయం ” అంటే సరియైన వివరణ “ మోక్షం ”, “ ఆత్మలబ్ధి ”.
“ ధ్రువానీతి ” అంటే “ దృఢమైన ధర్మం ”, “ చక్కగా అనుష్టింపబడిన ధర్మం ”
“ భూతి ” అంటే “ ఆనందం ” “ ఇహ, పర లోకాలలో ఆనందం ”
వీటిని సాధించడానికి ధ్యానాన్ని …
మన నిత్యజీవితంలో ఒక భాగంగా చేసుకుని …
ఆధ్యాత్మిక జీవనం సాగిద్దాం! ధ్యాన సాధనచేద్దాం!! ధ్యానయోగులమవుదాం!!!
ఏం చెప్పాడు శ్రీకృష్ణుడు?
“క్షుద్రం హృదయ దౌర్భల్యం ” … “ హృదయ దౌర్భల్యం తుచ్ఛమైనది”
“ గతాసూన్ అగతాసూంశ్చ … “ చనిపోయిన వారిని గురించి కానీ,
నాను శోచంతి పండితాః ” జీవించి వున్న వారి గురించి కానీ
పండితులుశోకించరు ”
“ అహమాత్మా గుడాకేశ ” … ‘ నేను ’ అనేది ‘ ఆత్మ ’ అని తెలుసుకో,
ఓ అర్జునా !
“ న హన్యతే హన్యమానే శరీరే ” … “ శరీరం చంపబడితే ఆత్మ చంపబడదు ”
“ యోగో భవతి దుఃఖహా ” … “ ధ్యానయోగాభ్యాసం వల్లనే దుఃఖం
హరిస్తుంది ”
“ సమత్వం యోగ ఉచ్యతే ” … “ అన్ని పరిస్థితులలోనూ సమంగా
వుండడమే యోగం అనిపించుకుంటుంది
“ శ్రద్ధవాన్ లభతే జ్ఞానం ” … “ శ్రద్ధ కలిగినవాడికే జ్ఞానం లభిస్తుంది ”
“ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం ” … “ ఆత్మజ్ఞానం అనే అగ్నిలో కర్మలు
దగ్ధమవుతాయి”
“ బుద్ధి నాశాత్ ప్రణశ్యతి ” … “ బుద్ధి లేకపోవడమే ఆత్మ వినాశనం ”
“ కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు … “ కర్మలుచెయ్యడానికేఅధికారం
కదాచన ” వుంది కానీ వాటి ఫలితాలపైన
ఎప్పటికీలేదు ”
“ కర్మ జ్యాయో హ్యకర్మణః ” … “ కర్మలు తక్కువ చెయ్యడం కంటే
కర్మలుఎక్కువచెయ్యడమేమంచిది ”
“ యోగః కర్మసు కౌశలమ్ ” … “ ధ్యానయోగం ద్వారానే కర్మల్లో
కౌశలంవస్తుంది”
“ యోగస్థః కురు కర్మాణి ” … “ యోగస్థితిలో వుండే కర్మలను
చెయ్యాలి ”
“ తస్మాత్ యోగీ భవార్జున ” … “ కనుక ధ్యానయోగివి కా, అర్జునా ! ”
“ నిస్త్రైగుణ్యో భవార్జున ” … “ త్రిగుణాలకు అతీతుడవు కా, అర్జునా !”
“ ఉద్ధరేదాత్మనాత్మానం ” … “ ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి ”
“ హతో వా ప్రాప్యసి స్వర్గం ” … “ చనిపోయాక స్వర్గాన్ని పొందుతావు”
“ యుద్ధస్య విగత జ్వరః ” … “ ఎంతమాత్రం ఆవేశం లేకుండా యుద్ధం
చెయ్యి”
“ యథేచ్చసి తథాకురు ” … “ నీకు నచ్చినట్టు నువ్వు చెయ్యి ”