“పరిపూర్ణ దివ్యజ్ఞానప్రకాశం”

 

“మనం ఏమిటి?”

“మనం ఎవరం?”

“ఎక్కడి నుంచి వచ్చాం?”

“ఎక్కడికి పోతున్నాం?”

“ఎందు కోసం పుట్టాం?”

“చనిపోయిన తరువాత ఏమౌతుంది?”

  “అసలు సంఘటనలు ఎలా జరుగుతున్నాయి?”

“ఈ జనన-మరణ చక్ర పరమార్థం ఏమిటి?”

“‘దైవం’ అంటే ఏమిటి?”

“ఈ అద్భుత సృష్టిక్రమం అంతా ఎలా సాగుతోంది?”

..ఇలాంటి ప్రశ్నలన్నింటికీ

పరిపూర్ణమైన సమాధానాలు స్వానుభవంతో తెలుసుకుని

తధనుగుణంగా జీవించటమే “దివ్యజ్ఞానప్రకాశం కలిగివుండడం” అంటే!

నిరంతర ధ్యానాభ్యాసం ద్వారా ..

మరి ఇతర ధ్యానుల అనుభవాలను విస్తారంగా వినడం ద్వారా ..

ధ్యానుల అనుభవ – పుస్తకాలను విశేషంగా చదవడం ద్వారా ..

అందరికీ పరిపూర్ణ దివ్యజ్ఞానప్రకాశం అనతికాలంలో కలిగి తీరుతుంది!