భగవద్గీత 12-5
“ క్లేశోஉధికతరస్తేషామ్ అవ్యక్తాసక్తచేతసామ్ | అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే || ” |
పదచ్ఛేదం
క్లేశః – అధికతరః – తేషాం – అవ్యక్తాసక్తచేతసాం – అవ్యక్తా – హి – గతిః – దుఃఖం – దేహవద్భిః – అవాప్యతే
ప్రతిపదార్థం
తేషాం = ఆ ; అవ్యక్తాసక్త చేతసాం = నిరాకార పరబ్రహ్మంమీద ఆసక్తి కలిగిన వారికి ; క్లేశః = శ్రమ ; అధికతరః = ఎక్కువ ; హి = ఎందుకంటే ; దేహవద్భిః = దేహాభిమానం గల వారిచేత ; అవ్యక్తా, గతిః = అవ్యక్త పరబ్రహ్మప్రాప్తి ; దుఃఖం, అవాప్యతే = కష్టసాధ్యమే
తాత్పర్యం
“ సగుణోపాసనకన్న నిర్గుణోపాసన అత్యంత క్లిష్టమైంది ; దేహాభిమానం కలవాళ్ళకు అవ్యక్తమైన ఆ నిర్గుణ బ్రహ్మ లభించడం కష్టసాధ్యం. ”
వివరణ
సగుణ, నిర్గుణ, ఉపాసనలలో …
సగుణోపాసన సులభ సాధ్యమైనది …
నిర్గుణోపాసన కష్ట సాధ్యమైంది.
ఎవరికి?
దేహాభిమానం వదలని వారికి మాత్రమే !
ఇంద్రియాలూ, మనస్సూ విజృంభిస్తూంటే …
పరబ్రహ్మతత్వాన్ని సాధించే సావకాశం ఎక్కడుంది?
మనోజయం, ఇంద్రియ నిగ్రహం కలిగి …
నిష్కామ కర్మాచరణ ద్వారా … దేహాభిమానాన్ని వదలిపెట్టిన యోగికి …
తనలోనే తాను పొందే ఆత్మసాక్షాత్కారం … బ్రహ్మాత్మ సాక్షాత్కారం …
సాధన ద్వారా … ధ్యానసాధన ద్వారా అత్యంత సులభసాధ్యమే.