భగవద్గీత 11-54

భక్త్యా త్వనన్యయా శక్య అహమేవంవిధోర్జున |

జ్ఞాతుం ద్రష్టుం చ తత్త్వేన ప్రవేష్టుం చ పరంతప ||

పదచ్ఛేదం

భక్త్యాతుఅనన్యయాశక్యఃఅహంఏవం విధఃఅర్జునజ్ఞాతుంద్రష్టుంతత్త్వేనప్రవేష్టుంపరంతప

ప్రతిపదార్థం

తు = అయితే ; పరంతప = శత్రువులను తపింప చేసేవాడా ; అర్జున = అర్జునా ; అనన్యయా, భక్త్యా = అనన్యభక్తి ద్వారా ; ఏవం విధః = ఇటువంటి ; అహం = నేను ; ద్రష్టుం = చూడడానికి ; తత్త్వేన, జ్ఞాతుం = తత్త్వజ్ఞానం ద్వారా తెలుసుకోవడానికి ; = అలాగే ; ప్రవేష్టుం, = ప్రవేశించడానికి ; శక్యః = సమర్ధుడవుతాడు

తాత్పర్యం

అర్జునా ! అనన్యమైన భక్తి ఒక్కటే నన్ను తెలుసుకొని, చూసి, నాలో ప్రవేశించడానికి సాధనం.”

వివరణ

భక్తిఅంటే ఏమిటి?

స్వస్వరూపానుసంధానమే భక్తి అని చెప్పబడుతుంది ”…

అని ఆదిశంకరాచార్యులవారి నిర్వచనం.

ఏ మానవుడైనా గానీ తన యొక్క స్వ స్వరూపంతో

అనుసంధానింపబడి ఉండడమేభక్తిఅని ఆయన ఉవాచ.

ఏమిటి మానవుడిస్వ స్వరూపం ”?

ఆత్మస్వరూపంఅన్నదే మానవుడిస్వ స్వరూపం

తనను తాను ఆత్మస్వరూపంగా తెలుసుకోవడమే

దర్శించుకోవడమే

తన ఆత్మలో తాను ప్రవేశించడమేభక్తి ”.

వేరే ఇతర విషయాల పైకి పోనివ్వనిఅనన్య భక్తికలిగి ఉండాలి.

అప్పుడే ఆత్మతత్త్వం అవగతం అవుతుంది.

దానికోసం ధ్యానసాధన చేసి తీరాలి

ఆత్మజ్ఞాని కావాలి.