భగవద్గీత 9-21

తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి |

ఏవం త్రయీధర్మమనుప్రపన్నా గతాగతం కామకామా లభన్తే ||

పదచ్ఛేదం

తేతంభుక్త్వాస్వర్గలోకం  విశాలంక్షీణేపుణ్యేమర్త్యలోకంవిశంతిఏవంత్రయీధర్మంఅనుప్రపన్నాఃగతాగతంకామకామాఃలభన్తే

ప్రతిపదార్థం

తే = వారు ; తమ్ = ; విశాలం = విశాలమైన ; స్వర్గలోకం = స్వర్గలోకాన్ని ; భుక్త్వా = అనుభవించాక ; పుణ్యే = పుణ్యాలు ; క్షీణే = క్షీణించగానే ; మర్త్యలోకం = మనుష్యలోకాలలో ; విశంతి = ప్రవేశిస్తారు ; ఏవం = ఈ ప్రకారంగా ; త్రయీధర్మం = మూడు రకాల ధర్మాలను ; అనుప్రపన్నాః = ఆశ్రయించేవారు ; కామకామాః = భోగాలను ఆశించినవారై ; గతాగతం = (స్వర్గమర్త్యలోకాల మధ్య) రాకపోకలను ; లభన్తే =పొందుతున్నారు

తాత్పర్యం

చనిపోయిన వారు విశాలమైన స్వర్గలోకంలో పుణ్యం క్షీణించిపోయేదాకా అనుభవించి తరువాత భూలోకంలో జన్మిస్తారు ; మూడు ధర్మాలను అనుష్ఠించే కామాభిలాషులు జనన మరణాలు అనే రాకడపోకడలను పొందుతున్నారు.”

వివరణ

విశాలమైనట్టిది స్వర్గలోకంఅని చెబుతున్నారు వేదవ్యాసులవారు

అక్కడ .. ” “ ఆ విశాలమైన స్వర్గలోకాలలో ”…

భూలోకంలో చేసుకున్న పుణ్యం పూర్తయ్యేదాకా అనుభవించి

మళ్ళీ తిరిగి ఈ లోకానికి వస్తాం

అయితేచనిపోయిన వెంటనేతిరిగి రాము

యాత్రలకు తీసుకెళ్ళిన డబ్బులు ఖర్చు అయిపోయిన తర్వాత

ఇంటికి తిరిగి వచ్చినట్టు

చేసుకున్న పుణ్యం కాస్తా స్వర్గలోకాలలో ఖర్చుపెట్టేసుకున్న తర్వాత

అప్పుడు తిరిగి ఈ భూలోకంలో జన్మిస్తాం.

ఎన్నో లోకాలు ఉన్నాయి :

భువర్లోకాలు, సువర్లోకాలు, జనలోకాలు, మహాలోకాలు, తపోలోకాలు,

సత్యలోకాలుఎన్నెన్నో లోకాలు.

దేనికోసం ఈ భూలోకంలో మళ్ళీ జన్మలు తీసుకుంటున్నాం?

అనేక రకాల ధర్మాలు ఉన్నాయి.

శరీరధర్మం ” .. “ సంఘధర్మం ” .. “ ఆత్మధర్మంఅనే త్రివిధ ధర్మాలు ఉన్నాయి.

భౌతిక శరీరం కోసం నిర్వర్తించవలసిన కార్యక్రమాలు ఉంటాయి

ఇవిశరీరధర్మంక్రిందికి వస్తాయి.

ఏ కుటుంబంలో పుడ్తామో ఆ కుటుంబాన్ని చూసుకోవాలిఅది  కుటుంబధర్మం ”.

ఏ సంఘంలో పెరుగుతామో ఆ సంఘాన్ని చూసుకోవాలి

అది  సంఘధర్మం ” .

కుటుంబ ధర్మంఅన్నదిసంఘధర్మంలో అంతర్భాగం.

అయితే, ఆత్మగురించి తెలుసుకోలేదు కనుక

ఆత్మజ్ఞానం పొందలేదు కనుక

మళ్ళీ మళ్ళీ జన్మించాల్సి వస్తుంది.

మరి ఈ రాకడ పోకడలను వదిలించుకోవాలంటే

ఆత్మధర్మంఅన్నది సరిగ్గా నిర్వర్తించాలి.

అంటే …“ ఆత్మగురించి తెలుసుకోవాలి

ఒకసారి ఆత్మ గురించి తెలుసుకుంటే … “ ఆత్మధర్మంనిర్వర్తిస్తే

మళ్ళీ శరీరం ఉండదుశరీరధర్మం ఉండదు ;

కుటుంబంఉండదు … “ కుటుంబధర్మంఉండదు ;

సంఘంఉండదు …“ సంఘధర్మంఉండదు

ఆ ఊర్ధ్వలోకాల్లో హాయిగాసదా విహరిస్తూనే ఉంటాం.

రావాలనుకుంటే వస్తాంమాస్టర్స్గా ఇతరులకు ధ్యానం చెప్పడానికి

లేకపోతే రానే రామురానక్కరలేదు

క్షీణే పుణ్యేఅంటేపుణ్యం క్షీణించిన తరువాత

స్వర్గలోకాలలో కొంతకాలం వున్న తరువాత

తిరిగి భూలోకం లోనికి వస్తూంటాం.

ఎంత వరకు? …

ఆత్మమోక్షం సంపాదించేంత వరకు

గతాగతంఅంటేగత అగత

వెళ్ళడం రావడంఅన్నమాట

స్వర్గలోకాలకు వెళ్ళడం ” … “ తిరిగి అక్కడ నుంచి రావటంఅన్నమాట

కామకామాఅంటేకామఅకామఅంటే

కోరికల వల్ల, మరి కోరికలను అధిగమించడం వల్లఅని అర్థం.

సరి అయిన కోరికలనుఆవిష్కారం చేసుకుంటూ

ఆ సరి అయిన కోరికలను సాధించుకుంటూ

మరి ఆ భూలోకాలకు మాత్రమే సరి అయిన కోరికలను

అధిగమిస్తూ వుండాలి కూడా.