భగవద్గీత 6-46

తపస్విభ్యోధికో యోగీ జ్ఞానిభ్యోపి మతోధికః |

కర్మిభ్యశ్చాధికో యోగీ తస్మాద్యోగీ భవార్జున ||

 

పదచ్ఛేదం

తపస్విభ్యఃఅధికఃయోగీజ్ఞానిభ్యఃఅపిమతఃఅధికఃకర్మిభ్యఃఅధికఃయోగీతస్మాత్యోగీభవఅర్జున

ప్రతిపదార్థం

యోగీ = యోగి ; తపస్విభ్యః = తాపసులకంటే ; అధికః = ఎక్కువ ; జ్ఞానిభ్యః = శాస్త్రజ్ఞానుల కంటే ; అపి అధికః = ఎక్కువ అని ; మతః = భావింపబడుతున్నాడు ; = మరి ; యోగీ = యోగి ; కర్మిభ్యః = సకామ కర్మలను ఆచరించే వారికంటె ; అధికః = ఎక్కువ ; తస్మాత్ = అందువలన ; అర్జున = ఓ అర్జునా ; యోగీ భవ = యోగివికా

తాత్పర్యం

అర్జునా ! తపస్సులు చేసేవారి కంటే, శాస్త్రజ్ఞానం కలవారికంటే, కర్మలనాచరించే వారికంటే కూడా ఒకానొక యోగి అధికుడు, కనుక యోగివికా అర్జునా ! ”

వివరణ

అర్జునుడునరతత్త్వంలో ఉన్నాడు.

విషాదంలో ఉన్నాడు.

దుఃఖ నివారణ కోసం … ‘ నారాయణతత్త్వాన్ని గ్రహించడం కోసం

యోగం చేసిధ్యానం చేసియోగివి అవమంటున్నాడు శ్రీకృష్ణుడు.

తాపసి ’ … అంటే హఠయోగిశరీరాన్ని శుష్కింప చేసుకునేవాడు.

ఒంటికాలిమీద నుంచుని ఆత్మపదార్థం దొరకుతుందేమోనని వెతికేవాడు.

ఒక కాలును వదిలిపెట్టి ఇంకొక కాలు మీద నుంచుంటే ఆత్మపదార్థం దొరకదు.

కాలికీ ఆత్మకూ సంబంధమే లేదు !

ఆయుధాలతో ఒళ్ళంతా తూట్లు పొడుచుకుంటే ఆత్మ దొరకదు.

శరీరానికి ఆత్మతో సంబంధమే లేదు. కనుక తాపసివి కావద్దు, యోగివికా !

శాస్త్రాలను అధ్యయనం చేసి ఆ పాండిత్యాన్నంతా ఔపాసన పట్టిన,

గ్రంథాలన్నీ చదివేసి అశువుగా చెప్పే పండితుడి కన్నా ధ్యానయోగి ఎక్కువ.

స్వార్థరహితంగా మంచి కర్మలు చేస్తూ

పరమాత్మను పొందాలని ప్రయత్నించేవాడు కర్మయోగి.

అటువంటి కర్మయోగి కంటే కూడా ఒకానొక ధ్యానయోగి ఎక్కువ.

ధ్యానం ద్వారా శరీరం, మనస్సు, బుద్ధులతో తాదాత్మ్యాన్ని వదిలించుకుని

పరమ ఉత్కృష్టమైన ఆత్మచైతన్యంతో లయమవ్వాలని సాధన చేసేవాడు,

ఆత్మానుభూతికై తపించేవాడే ఒకానొక ధ్యానయోగి.

వీరందరూ నరతత్త్వంలో ఉన్నారు.

నారాయణతత్త్వం గ్రహించడానికి వారి వారి మార్గాలలో ప్రయాణిస్తున్నారు.

వీరందరిలో ధ్యానయోగి అధికుడు కనుక

నీవు యోగివి కా అర్జునా !

యోగం చెయ్యి ! యోగం అభ్యాసం చెయ్యి !

ధ్యాన యోగివికా ! ’ అంటున్నాడు శ్రీకృష్ణపరమాత్మ.

ఇదే భగవద్గీత యొక్క సమగ్ర సారాంశం

భగవద్గీత యొక్క ముఖ్య సందేశం.

మనం శరీరం కాదుఆత్మఅని తెలుసుకోవడమే భగవద్గీతా సారం.