భగవద్గీత 6-35

అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్ |

అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే ||

 

పదచ్ఛేదం

అసంశయంమహాబాహోమనఃదుర్నిగ్రహంచలంఅభ్యాసేనతుకౌంతేయవైరాగ్యేణగృహ్యతే

ప్రతిపదార్థం

మహాబాహో = గొప్ప బాహువులు కలవాడా ; అసంశయం = నిస్సందేహంగా ; మనః = మనస్సు ; చలం = చంచలమైనదే ; దుర్నిగ్రహం = నిగ్రహింపలేనిదే ; తు = అయితే ; కౌంతేయ = ఓ కుంతీ సుతా ; అభ్యాసేన, = అభ్యాసం చేత , మరి ; వైరాగ్యేణ = వైరాగ్యం వలన ; గృహ్యతే = నిగ్రహింప బడుతుంది

తాత్పర్యం

అర్జునా, నిస్సందేహంగా మనస్సనేది చంచలమైనది. మరి నిగ్రహించడానికి కష్టసాధ్యమైనది. అయినప్పటికీ అభ్యాసం చేత మరి వైరాగ్యం చేత దానిని సులభంగా నిగ్రహించవచ్చును. ”

వివరణ

మనస్సుఅనేది అతి చంచలమైనదే !

దీనిని లొంగదీసుకోవడం అత్యంత కష్టసాధ్యమైన పనే !

అయినప్పటికీ అకుంఠిత దీక్షతో సాధన చెయ్యడం ద్వారానూ

మరి శాస్త్రయుత వైరాగ్య భావాలను పెంపొందించుకోవడం ద్వారానూ

దానిని సులభంగా నిగ్రహించవచ్చును.

అకుంఠిత దీక్షఅంటేఏ రోజూ కుంటుపడని దీక్ష ” …

ఆ విధమైన దీక్ష వుండి తీరాలి

మనస్సును నియంత్రణలోకి తీసుకురావాలంటే

ప్రతిరోజూ విధిగా ధ్యానసాధన వుండి తీరాలి.

ఏ రోజూ కూడారేపు చేస్తానుఅనరాదు.

ప్రతిరోజూ కూడా ధ్యానయోగసాధనకై వినియోగింప బడాలి !

కుంఠిత దీక్షవుంటేఆత్మస్థితికి చేరలేం

కావలసిందిఅకుంఠిత దీక్ష ” !

ఇకపోతేవైరాగ్యం ” …

శాస్త్రీయమైన వైరాగ్యంవుండాలి

అత్యాచారంపట్ల వైరాగ్యం వుండాలి

ఏదీ ఎక్కువగా, అవసరమైన దానికి మించి చేయరాదు

ఎప్పుడూమధ్యేమార్గంలోనే జీవించాలి

అతి సర్వత్ర వర్జయేత్ !

అదేశాస్త్రీయమైన వైరాగ్యాన్ని కలిగి వుండడంఅంటే !

అలాంటప్పుడే ధ్యానయోగసాధన పుష్పిస్తుంది, ఫలిస్తుంది.