భగవద్గీత 6-30

యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి |

తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి ||

 

పదచ్ఛేదం

యఃమాంపశ్యతిసర్వత్రసర్వంమయిపశ్యతితస్యఅహంప్రణశ్యామిసఃమేప్రణశ్యతి

ప్రతిపదార్థం

యః = ఎవరైతే ; సర్వత్ర = సకల ప్రాణులలో ; మాం = (ఆత్మ రూపంలో వ్యాపించి ఉన్న) నన్ను ; పశ్యతి = చూస్తాడో ; సర్వం చ = అలాగే సమస్త ప్రాణులనూ ; మయి = నాలో ; పశ్యతి = చూస్తాడో ; తస్య = వానికి ; అహం = నేను ; న ప్రణశ్యామి = కనపడక పోను ; సః చ = అతడు కూడా ; మే = నాకు ; న ప్రణశ్యతి = కనపడక పోడు

తాత్పర్యం

అన్ని ప్రాణులలో తననూ, తనలోనే అన్ని ప్రాణులనూ చూసే వాని మీద నా దృష్టీ, నా మీదే వాని దృష్టీ వుంటాయి.”

వివరణ

ఈ శ్లోకంలో మొదటి పాదంలోమాం”, “మయిఅన్నపదాలఅసలు

అర్థాలకోసం ఎవరికి వారు తమకు తాముగా అన్వయించుకోవాలి.

రెండవ పాదంలోనిఅహంను శ్రీ వేదవ్యాసునికి, లేక శ్రీకృష్ణునికి

అన్వయించి అర్థం చేసుకోవాలి.

ధ్యానసాధనలో పరిపూర్ణత సాధించిన స్థితిలో

ఒకానొక ధ్యానితన మనోబుద్ధులను అతిక్రమించి

ఆత్మతో ఏకత్వం పొందుతాడు.

అంటే ధ్యానయోగికి సమస్త చరాచర ప్రాణికోటిలో

ఒకే ఆత్మ తప్ప ఇంకేమీ కనపడదు.

ఆత్మయొక్క సర్వవ్యాపకత్వం అర్థం అయి

తనకంటే భిన్నంగా ఏదీ లేదని తెలుస్తుంది.

ఈ విధంగా సమస్తంలో తనను, తనలో సమస్తంనూ చూడగలడు.

ఒక్కటే మట్టితో రకరకాల కుండలను తయారుచేసినా,

అన్నింటిలో ఉన్న మట్టి ఒకటే కదా !

ఆభరణాలు వేరైనా బంగారం ఒకటే కదా !

కనుక ఎవరికి ఎవరూ వేరు వేరు కారు.

అంతా ఒకటే ఆత్మపదార్థం.

దాన్ని తెలుసుకోవడానికే ధ్యానం చేయాలి

ధ్యాన సాధన చేయాలి

ధ్యానయోగి కావాలి.

ఒకానొకఅయోగిమరియోగిఅయి

తనలో సర్వాన్నీసమస్తంలో తననూ చూడగలిగినప్పుడు

అతనికంటే తాను, తనకంటే అతను వేరు కాదు అంటున్నారుశ్రీకృష్ణపరమాత్మ !