అన్నమయ్య

 

“అన్నమయ్య” గొప్ప యోగి, గొప్ప జ్ఞాని

కనుకునే, ఈ క్రింది విషయాలు చెప్పగలిగాడు –

“చూచే చూపొకటి, సూటి గురి యొకటి,

తాచి రెండూ నొకటైతే దైవమే సుండీ”

“భావమే జీవాత్మ, ప్రత్యక్షము పరమాత్మ

తావు మనోగోచరుడు దైవమే సుండీ.”

“చూచే చూపు” అంటే “లోచూపు” – దివ్యదృష్టి

“సూటి గురి” అంటే “బ్రహ్మజ్ఞానం” అనే లక్ష్యం

“తాచి రెండూ నొకటైతే” అంటే

“దివ్యదృష్టి ద్వారా బ్రహ్మజ్ఞానం పొందినప్పుడు”

“దైవము నుండీ” అంటే “అప్పుడు మనమే దైవాలము” అని.

‘నేను’ అనే భావమే జీవాత్మ; ప్రకృతి అంతా పరమాత్మ

అనంతకోటి బ్రహ్మాండాలను ప్రత్యక్షంగా దివ్యదృష్టితో చూడగలిగే

‘మనోగోచరుడు’ అయినవాడే ‘దైవం’ అనబడతాడు.

అన్నమయ్య చెప్పిన మరికొన్ని సత్యాలు:

  • “కాయపుటూపిరిలోనే గని యున్నది”
  • “ఊపిరిలో దేవుడున్నాడు యోగీంద్రులకు”
  • “చిత్తమంతర్ముఖము సేసుకొననేర్చెనా అత్తల నతడు యోగి‘ యనబడును; “సత్తసత్తనెడి సువిచారంబు గలిగెనా ‘ఉత్తమ వివేకి‘ యని ఊహింపబడును”