భగవద్గీత 4-10

వీతరాగభయక్రోధా మన్మయా మాముపాశ్రితాః |

బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః ||

 

పదచ్ఛేదం

వీతరాగభయక్రోధాఃమన్మయాఃమాంఉపాశ్రితాఃబహవఃజ్ఞానతపసాపూతాఃమద్భావంఆగతాః

ప్రతిపదార్థం

వీతరాగభయక్రోధాః = అనురాగం, భయం, క్రోధం లేనివాళ్ళు ; మన్మయాః = నాలోనే స్థితమైనవారు ; మాం, ఉపాశ్రితాః = ‘ నన్నుఆశ్రయించిన వారు ; బహవః = అనేకమంది ; జ్ఞానతపసా = జ్ఞాన తపస్సుచేత ; పూతాః = పవిత్రులై ; మద్భావం, ఆగతాః = నా స్వరూపాన్ని పొందారు.

నేను = ఆత్మ

అర్జునుడు = నేను దేహం అనుకునే తత్వం

శ్రీకృష్ణుడు = నేను ఆత్మను అని తెలుసుకున్న తత్వం

భగవాన్ ఉవాచఆత్మ ఉవాచ :

అనురాగం, కోపం, భయం విడిచి పెట్టి, ‘ నాలోస్థితమైనవారు ఎంతోమందిఇటువంటి జ్ఞాన తపస్సు చేత పవిత్రులైనాస్వరూపాన్నే పొందారు. ”

వివరణ

శ్రీకృష్ణుడుఅంటేఆత్మఅని పదే పదే గుర్తుంచుకోవాలి.

ఈ శ్లోకంలోనేనుఅన్నప్పుడల్లాఆత్మఅని అర్థం చేసుకోవాలి.

శ్రీకృష్ణుడుఅనే వ్యక్తికి సంబంధం కాదు.

మన్మయాఃఅంటేఎవరికి వారే ” … “ తన ఆత్మలో తాను ”.

మాముపాశ్రితాః ” – అంటేతన ఆత్మను తానే ఆశ్రయించుకోవడం ”…

ఎవరి ఆత్మధ్యానంలో వారుండడం ” ;

మద్భావమాగతః ” – అంటేఆత్మస్వరూపాన్ని పొందడం

భగవద్గీతఅన్నది మనలో జ్ఞానం పెంపొందడానికీ

మన కర్తవ్య కర్మలను మనం సక్రమంగా నిర్వర్తించ గలగడానికీ

మరి మనలను ధ్యానులుగా, ధ్యానయోగులుగామలిచేందుకూ

ప్రబోధింపబడింది.

మనలోనే అపారమైన శక్తి ఉంది. దానిని వినియోగించుకోవడానికి

రాగం, భయం, క్రోధం విడిచిపెట్టి,

మనల్ని మనమే ఆశ్రయించుకుని,

మన ఆత్మధ్యానంలో మనముండి,

మేము ఆత్మలముఅని గ్రహించి, ఆత్మజ్ఞానులుగా మారాలి.

ధ్యానం చేసిజ్ఞాన తపస్సుతోపరిపూర్ణమయిపోవాలి.