మూడు అడుగులు

 

“‘భూలోకం’ .. ‘భువర్లోకం’ .. ‘స్వర్గలోకం’
అనే మూడు లోకాలను, మూడు అడుగులను
వామనుడు బలిచక్రవర్తిని కోరాడు

” ‘భూలోకం’ అంటే ఏమిటి ?
మన శరీరమే ‘భూలోకం’
దీనినే కొంతమంది ‘ప్రకృతి’ అని కూడా అంటారు
ఇంక మనస్సే ‘భువర్లోకం’
ప్రజ్ఞయే ‘సువర్లోకం’

“‘బలి’ అంటే ‘పన్ను’ లేక ‘సుంకం, టాక్స్’
మన ఇంటికి నీరు సరఫరా చేసినందుకు మున్సిపాలిటీకి
పన్ను కడతాం కదా,
అదేవిధంగా, మానసిక సంబంధమైన దానికి కూడా ‘ పన్ను ’ కట్టాలి
బలిచక్రవర్తి కట్టిన సుంకం ఏమిటి ?
తన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులన్నింటినీ
భగవంతునికి ధారపోయడం

“పురాణాలలోని కథలు కొన్ని విచిత్రంగా వుంటాయి
భగవంతుని ఒక పాదం భూలోకాన్నంతా ఆక్రమించిందట !
రెండవ పాదం ఆకాశాన్నంతా వశం చేసుకుందట !
మూడవ పాదం బలిచక్రవర్తి తలపై పెట్టాడట !
అంటే, ‘శారీరక భ్రాంతిని ధ్వంసం చేశాడు’ అని అర్థం “

– శ్రీ సత్యసాయి
(“సనాతన సారధి” , అక్టోబరు ’94)

* శారీరకంగా, మానసికంగా, మరి ఆధ్యాత్మికంగా .. మూడింటిలోనూ
భగవంతుడు ప్రవేశించాడు .. దీని అంతరార్ధం ఇదే.