ముక్తి – పరిముక్తి – మహాపరిముక్తి
ముక్తస్థితులుమూడు,
అవి
1. ముక్తి
2. పరిముక్తి
3. మహాపరిముక్తి
బుద్ధుడుభాషలోఇవే–
1. నిర్వాణం
2. పరినిర్వాణం
3. మహాపరినిర్వాణం
“సాధనతో సమకూరు పనులు ధరలోన.” – అన్నాడు వేమన,
ముక్తిసాధనామార్గాలుమూడు–
1. సాధన
2. పరిసాధన
3. మహాపరిసాధన
నిర్వాణం పొందిన వారిని ‘అరిహంతులు’అంటాం.
పరినిర్వాణం పొందిన వారిని ‘భోధిసత్వులు’అంటాం.
మహాపరినిర్వాణం పొందిన వారిని ‘బుద్ధుళ్ళు’అంటాం.
‘ధ్యాన సాధన’ ద్వారా ‘ముక్తి’ లభిస్తుంది.
-అంటే, శ్వాసానుసంధానం ద్వారా చిత్తవృత్తి నిరోధం జరిగి ఆత్మానుభవం జరుగుతుంది.
-ఆత్మానుభవమే ప్రాథమిక ముక్తి.
ఇకపోతే, ‘పరిముక్తి’ అన్నది ‘పరిసాధన’ ద్వారా లభిస్తుంది.
‘ధ్యాన సాధన’ అన్నది ‘సాధన’ అయినప్పుడు
‘స్వాధ్యాయ సాధన’ … ‘పరిసాధన’ అవుతుంది.
సృష్టిలోని సకల యోగీశ్వరుల, సకల జగద్గురువుల ధ్యానానుభవాలనూ, జ్ఞానపాఠాలనూ కూలంకషంగా అధ్యయనం చేయడమే ‘స్వాధ్యాయం’అనబడుతుంది.
స్వాధ్యాయ సాధనే పరిసాధన, స్వాధ్యాయం ద్వారానే పరిముక్తి, పరినిర్వాణం.
మూడవ సాధన ‘మహాపరిసాధన’ … దీని ద్వారానే ‘మహాపరిముక్తి’, ‘మహాపరినిర్వాణం’ పొందుతాం … మరి ‘బుద్ధుళ్ళ’మవుతాం.
ఈ మూడవ సాధనే ‘సజ్జన’ సాంగత్య సాధన. మనకన్నా ఉన్నత జ్ఞానస్థితిలో వున్న వారందరి నుంచీ సదా, ముఖతః నేర్చుకోవడం; మనకన్నా అల్పజ్ఞాన స్థాయిలో వున్న వారందరికీ, సదా, ముఖతః జ్ఞానాన్ని బోధించడం – ఇదే ‘సజ్జన సాంగత్య మహాపరిసాధన’ అనబడుతుంది.
-ధ్యానం ద్వారా ముక్తి.
-ధ్యాన, స్వాధ్యాయాల ద్వారా పరిముక్తి.
-ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాల ద్వారా మహాపరిముక్తి.
స్వంత ముక్తి కోసం పాటుపడినప్పుడు ‘ముక్తి’లభిస్తుంది.
కొంతమంది ఇతరుల ముక్తికి అహర్నిశలూ, పాటుపడినప్పుడు ‘పరిముక్తి’లభిస్తుంది.
సకల ప్రాణికోటి ముక్తికి … అహర్నిశలూ, శ్వాస వున్నంతకాలం … దేహం వున్నంతకాలం … కృషి సల్పితే‘మహాపరిముక్తి’లభిస్తుంది.
పిరమిడ్ మాస్టర్లందరూ మహాపరిసాధకులు.
పిరమిడ్ మాస్టర్లందరూ మహాపరిముక్తి కాముకులు.
పిరమిడ్ మాస్టర్లందరూ బుద్ధుళ్ళు.