మూఢభక్తుడు –శిష్యడు
ఒకానొక
“మూఢభక్తుడు” ఎప్పుడూ
బాహ్యచేష్టలలో నిమగ్నుడై వుంటాడు
అంటే,
పూజలూ, అభిషేకాలూ, అర్చనలూ . .
మొదలైనవాటిలో కొట్టుకుపోతూ వుంటాడు
“భయగ్రస్థుడు” అయినవాడే “మూఢభక్తుడు”
కొద్దిగా మేలైన పక్షంలో భక్తుడు మంత్రానుష్ఠానం చేస్తూ వుంటాడు ;
అంతేకానీ, జిజ్ఞాసువుగా, జ్ఞానపిపాసిగా మారడానికి ఏ భక్తుడూ
సుతరామూ సిద్ధపడడు
“పాహిమాం” , “పాహిమాం” అని ఓ మూఢభక్తుడు
ఎప్పుడూ ఆర్తనాదాలు పలుకుతూ వుంటాడు ;
తన చుట్టూ ఎప్పుడూ ఆపదలనే భక్తుడు చూస్తూంటాడు
ఓ భక్తుడు గురువులనూ, పరమగురువులనూ భగవంతుని ‘అవతారాలు’ గా
తలచుకుంటూ ఎప్పుడూ వారి నామస్మరణంలో వుంటాడు
ఏ భక్తుడూ కూడా
తాను కూడా వారిలా కాగలను అనీ, అలాగ కావాలి అనీ తలంచడు
కానీ,
“శిష్యుడు” అయినవాడు
తాను కూడా పరమగురువుల లాగా అయితీరాలి అని తెలుసుకుని,
“వారు పరమగురువులైనప్పుడు నేను కూడా వారిలాగే కాగలను” అని
గ్రహించి,
ఇక దీక్షగా ధ్యాన అభ్యాసం, జ్ఞానసాధన మొదలుపెడతాడు
శిష్యుడు భయాన్ని అదుపులో పెట్టుకుంటాడు ;
“పాహిమాం” , “పాహిమాం” అని ఎప్పుడూ అరవడు ;
ఆపదలను ఎప్పుడూ లెక్కపెట్టడు
ఇతనే జిజ్ఞాసువు; క్రమంగా ఒకానొక “ముముక్షువు” అవుతాడు
“ముముక్షువు” అంటే “తీవ్రధ్యాని” ; “ముముక్షువు” అంటే
“తీవ్రజ్ఞానపిపాసి”
* మూఢభక్తి వలన ఏమీ వొరగదు ; ఉన్నది కూడా నశిస్తుంది ;
తక్షణ కర్తవ్యం వెంటనే ‘శిష్యుడి‘గా మారాలి