భగవద్గీత 3-7

యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున |

కర్మేంద్రియైః కర్మయోగ మసక్తః విశిష్యతే || ”

 

పదచ్ఛేదం

యఃతుఇంద్రియాణిమనసానియమ్యఆరభతేఅర్జునకర్మేంద్రియైఃకర్మయోగంఅసక్తఃసఃవిశిష్యతే

ప్రతిపదార్ధం

తు = అయితే ; అర్జున = అర్జునా ; యః = ఎవరైతే ; మనసా = మనస్సుతో ; ఇంద్రియాణి = ఇంద్రియాలను ; నియమ్య = వశం చేసుకుని ; అసక్తః = అనాసక్తుడై ; కర్మేంద్రియైః = ఇంద్రియాల ద్వారా ; కర్మయోగం = కర్మయోగాన్ని; ఆరభతే = ఆచరిస్తున్నాడో ; సః = అలాంటి వాడే ; విశిష్యతే = ఉత్తముడు

తాత్పర్యం

అయితే, అర్జునా, ఎవరు మనస్సులో మాత్రమే ఇంద్రియాలను వశపరచుకుని అనాసక్తుడై అన్ని ఇంద్రియాల ద్వారా కర్మయోగాన్ని ఆచరిస్తున్నాడో అతడే ఉత్తముడు. ”

వివరణ

ఉత్తములు ఎలా వ్యవహరిస్తారు ?

ఉత్తములు బహిర్ దమం ఆచరించనివారు;

అంతశ్శమం కోరుకునేవారు

ఉత్తములు బహిర్ ఇంద్రియాలను

మనస్సులో మాత్రమేస్వాధీన పరచుకుంటారు !

ఉత్తములు బయట ఏమాత్రం నిగ్రహాన్ని పాటించనివారు

అయినా లోపల మహానిగ్రహాన్ని పొందినవారు.

వారుబయట ఏమైనా సరేలోపల ఏమీ కాకూడదు

అని తెలుసుకున్నవారు !

బయట ఎలాంటి కర్మలు ఆచరించినా వాటి ప్రభావం వారి లోపల వుండదు.

బయట ప్రకృతిసహజసిద్ధమైన కర్మాచరణ !

లోపల సంపూర్ణమైన కర్తృత్వభావనా శూన్యత !

ఇదే నిజమైన కర్మయోగం !