భగవద్గీత 3-6

కర్మేంద్రియాణి సంయమ్య ఆస్తే మనసా స్మరన్ |

ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారఃస ఉచ్యతే || ”

 

పదచ్ఛేదం

కర్మేంద్రియాణిసంయమ్యయఃఆస్తేమనసాస్మరన్ఇంద్రియార్థాన్విమూఢాత్మామిథ్యాచారఃసఃఉచ్యతే

ప్రతిపదార్ధం

యః = ఎవరు ; విమూఢాత్మా = మూఢబుద్ధి కలవాడు ; కర్మేంద్రియాణి = అన్ని కర్మేంద్రియాలను ; సంయమ్య = నిరోధించి ; మనసా = మానసికంగా ; ఇంద్రియార్థాన్ = ఇంద్రియ విషయాలను ; స్మరన్ = స్మరిస్తూ ; ఆస్తే = ఉంటాడో ; సః = అలాంటివాడు ; మిథ్యాచారః = ‘మిథ్యాచారిఅంటేదంభి’, ‘ఢంబాచారి’ ; ఉచ్యతే = పిలువబడుతున్నాడు.

తాత్పర్యం

మూఢబుద్ధి గల వ్యక్తి ఇంద్రియాలన్నింటినీ బలవంతంగా నిరోధించి మనస్సులో సదా వాటినే స్మరిస్తూ వుంటాడో అతడేమిథ్యాచారిఅంటేఢంబాచారిఅనబడతాడు. ”

వివరణ

బాహ్య ఇంద్రియ నిగ్రహాన్నిదమంఅంటాం.

ఇంద్రియాలను బలవంతంగా నిగ్రహించడమేదమం. ”

అంతరేంద్రియం అయిన మనస్సు యొక్క నియంత్రణనుశమంఅంటాం.

కేవలందమంవుండిశమంలేకపోతే

అది నిరర్థకంఅది అనర్థదాయకం.

అప్పుడు కోరికలు మనస్సులో అంతర్ముఖంగా విజృంభిస్తూనే వుంటాయి

మనస్సు అల్లకల్లోలం అవుతూనే వుంటుంది.

అలాంటి మానవుడు మూఢబుద్ధికి నిలయం అవుతాడు.

కనుక, ఇంద్రియాలను బలవంతంగా బిగబట్టి కూర్చుని,

మనస్సులో వ్యవహారాలన్నింటినీ ఆలోచిస్తూ

మనస్సులోనే మూడు లోకాలనూ చుట్టి వచ్చే

మిథ్యాచారి ’, ‘ ఢంబాచారి ’, కాకూడదు.

మనస్సును ఎలాంటి పరిస్థితులలోనూ, అల్లకల్లోల పరచుకోకూడదు.

బలవంతపు బ్రాహ్మణార్థంఎప్పుడూ పనికిరాదు !

సదా, ఎల్లప్పుడూపట్టువిడుపు

అన్నవి వుండి తీరాలి !

జీవితంలో సహజంగా బ్రతకాలి !

పరిపూర్ణయోగిగా విరాజిల్లాలంటే “ 

దమంతో ప్రారంభమయి,

వెంటనేశమంలోకి ఎగబ్రాకాలి !

కేవలందమంలోనే ఉంటే అది ఆరంభ

శూరత్వం మాత్రమే !

అది యుక్తం కాదు !