భగవద్గీత 3-5

హి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్యకర్మకృత్ |

కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః || ”

 

పదచ్ఛేదం

హికశ్చిత్క్షణంఅపిజాతుతిష్ఠతిఅకర్మకృత్కార్యతేహిఅవశఃకర్మసర్వఃప్రకృతిజైఃగుణైః

ప్రతిపదార్ధం

హి = నిస్సందేహంగా ; కశ్చిత్ = మానవుడు కూడా ; జాతు = సమయంలో కూడా ; క్షణం = రెప్పపాటు కాలం ; అపి = అయినప్పటికీ ; అకర్మకృత్ = పని చేయకుండా ; తిష్ఠతి = ఉండలేడు ; హి = ఎంచేతంటే ; సర్వః = సమస్త మనుష్య సముదాయం ; ప్రకృతిజైః = ప్రకృతి వల్ల జన్మించిన ; గుణైః = గుణాల ద్వారా ; అవశః = వివశుడై ; కర్మ = కర్మాచరణకు కార్యతే = బాధ్యత వహిస్తోంది.

తాత్పర్యం

నిస్సందేహంగా మానవుడైనా కూడా ఎలాంటి సమయంలోనైనా కర్మచేయకుండా క్షణకాలం అయినా వుండలేడు ! ఎంచేతంటే ప్రకృతి వల్ల జన్మించబడిన గుణాలకు లోబడే మానవ సముదాయం అంతా కర్మాచరణకు ఉపక్రమిస్తోంది. ”

వివరణ

సత్త్వ, రజ, స్తమో గుణాలు త్రిగుణాలు ; త్రిగుణాలు మానువుడి నైజాలు.

గుణాలకు అనుగుణంగానే మానవుడు వివిధ కర్మలను చేస్తుంటాడు.

గుణాల సమాహారమేప్రకృతి”; గుణ వ్యవస్థనేప్రకృతిఅంటాం.

జీవాత్మల వివిధ కర్మలే ప్రకృతి! జీవాత్మల వివిధ కర్మ సముచ్చయాలే ప్రకృతి!

ప్రకృతి ఒక మహా కర్మఫలసముద్రం ! అది నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది.

ప్రకృతిలో కర్మఫలమహాసముద్రంలో

ప్రతి మనిషీ ఒకానొకఅలమాత్రమే;

ఒకానొకఅలజడిమాత్రమే !

అహంకారం చేత ప్రేరేపింపబడిన కోరికలతో

తాను చేసే వివిధ క్రొత్తక్రొత్త కర్మల ద్వారా మనిషి

ఎప్పటికప్పుడుమళ్ళీ మళ్ళీ .. క్రొత్త క్రొత్త

వాసనలను తగిలించుకుంటూ ఉంటాడు

క్రొత్త సంస్కారాలను పొందుతూ ఉంటాడు.

కువాసనలను పోగొట్టుకోడానికీమరి

సువాసనలను సుదృఢం చేసుకోవడానికీ మళ్ళీ

మళ్ళీ జన్మలు తీసుకుంటూనే ఉంటాడు

జనన మరణ చక్రంలో పడి నలుగుతూనే ఉంటాడు.

కనుకనే మనిషి కర్మసంజాతుడుకర్మలలోంచి పుట్టినవాడు !

మనోబుద్ధులు ఉన్న మనిషీ కూడా మేలుకుని ఉన్నంత సేపూ

పనీ చెయ్యకుండా ఒక్క క్షణం కూడా ఉండలేడు.

శరీరం విశ్రాంతిగా ఉన్నా, మనోబుద్ధుల ద్వారా

ఎప్పుడూ ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటాడు.

తినడం, త్రాగడం, నిద్రించడం, లేవడంఇలాంటివన్నీ కూడా కర్మలే.

కనీసం ఇవైనా చెయ్యకుండా ఎవ్వరూ ఉండలేరు కాబట్టి

మనిషి కర్మలకువివశుడు” … అంటేకర్మలకు వశం అయినవాడు !

మనిషి ఎప్పటికీ కర్మశూన్యుడు కాజాలడు !

 ‘కర్మ శూన్య స్థితిఅన్నది అసంభవం !

మనిషి కర్మపూర్ణుడురకరకాల కర్మలను సదా చేస్తూనే వుంటాడు !

అంతర్ గుణాలకు మూలం అనంతమైన బహిః కర్మలు !

అనంతమైన బహిః కర్మలకు మూలాలు అంతర్ గుణాలు ! ఇదీ పరిస్థితి !