భగవద్గీత 2-63

క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః |

స్మృతిభ్రంశాద్బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి || ”

 

పదచ్ఛేదం

క్రోధాత్భవతిసమ్మోహఃసమ్మోహాత్స్మృతివిభ్రమఃస్మృతిభ్రంశాత్బుద్ధినాశఃబుద్ధినాశాత్ప్రణశ్యతి

ప్రతిపదార్థం

క్రోధాత్ = క్రోధం వలన ; సమ్మోహః = వ్యామోహం ; భవతి = కలుగుతుంది ; సమ్మోహాత్ = వ్యామోహం వలన ; స్మృతివిభ్రమః =జ్ఞాపకశక్తి నశిస్తుంది ; స్మృతిభ్రంశాత్ = జ్ఞాపకశక్తి నశించినప్పుడు ; బుద్ధినాశః = బుద్ధి నశిస్తుంది ; బుద్ధినాశాత్ = బుద్ధి నశించడం వలన ; ప్రణశ్యతి = పతనమవుతాడు

తాత్పర్యం

కోపం వలన అవివేకం, అవివేకం వల్ల స్మృతిభ్రంశం, దాని వలన బుద్ధీ చెడతాయి; బుద్ధి చెడగానే పురుషుడు నశించిపోతాడు. ”

వివరణ

విషయాసక్తి వల్ల సంగం పెరుగుతుంది.

సంగం వల్ల కామం కలుగుతుంది.

కామం తీరకపోతే క్రోధం వస్తుంది.

క్రోధం నుంచే సమ్మోహం వస్తుంది.

సమ్మోహంఅంటేవిపరీతమైన మోహం ”.

అది లేకపోతే ఉండలేనుఅన్నంత మోహం.

స్థితిలో వివేకం నశిస్తుందిజ్ఞానం నశిస్తుందిబుద్ధి నశిస్తుంది

అహంకారం విజృంభిస్తుంది.

చేస్తున్న పని యొక్క పరిణామాలనూ,

మంచి చెడులనూ

ఏమాత్రం పట్టించుకోం.

సత్యాసత్యాలు, ఉచితానుచితాలను మరచిపోతాం;

విచక్షణా జ్ఞానం కోల్పోతాం ;

మనిషి తన స్థితి నుండి పతనమైపోతాడు.

కనుక బుద్ధి నశించటమేచావు ” … అంతకంటే వేరే చావు లేదు.

మయసభలో సుయోధనుడి భంగపాటు చూసి ద్రౌపది నవ్వింది.

దానితో వాడి బుద్ధి నశించింది; వాడివల్ల వాడు నాశనం అయ్యాడు;

తద్వారా ప్రపంచం అంతా నాశనం అయ్యింది.

ఒక గ్రుడ్డి ఎద్దు చేలో పడితే దానికీ నష్టమే, చేనుకీ నష్టమే.

మోహాంధకారంలో ఉన్నవాడువిలువలు తల్లక్రిందులు అయిన వాడు

తాను చెడిపోయి ఇతరులకు కూడా చెడుపు చేస్తాడు.

మానవుడు ఏరకంగా పతనమవుతాడో వేదవ్యాసులవారు ఇక్కడ చెప్పారు.

మనల్ని మనం పతనం కాకుండా ఎలా రక్షించుకోవాలో మార్గాన్ని సూచిస్తున్నారు ఆదిశంకరాచార్యుల వారు వారి యొక్కభజగోవిందంలో.

సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం

  నిర్మోహత్వే నిశ్చలచిత్తం, నిశ్చల చిత్తే జీవన్ముక్తిః

సజ్జనులతో సత్కాలక్షేపం చేస్తూ ఉంటే ప్రాపంచిక విషయాసక్తి నశిస్తుంది.

విషయాసక్తి తగ్గితేకోరికలు తగ్గిక్రమంగా మోహం నశిస్తుంది;

తద్ద్వారా మనస్సు నిశ్చలమవుతుంది.

నిశ్చలమైన చిత్తమే జీవన్ముక్తి అంటున్నారు శ్రీ ఆదిశంకరాచార్యులవారు !