భగవద్గీత 2-58

యదా సంహరతే చాయం కూర్మోఙ్గానీవ సర్వశః |

ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా || ”

 

పదచ్ఛేదం

యదాసంహరతేఅయంకూర్మఃఅంగానిఇవసర్వశఃఇంద్రియాణిఇంద్రియార్థేభ్యఃతస్యప్రజ్ఞాప్రతిష్ఠితా

ప్రతిపదార్థం

= మరి ; కూర్మః = తాబేలు ; సర్వశః = అన్నివైపులనుండి ; అంగాని = అవయవాలను ; ఇవ = ఏవిధంగా ; యదా = ఎప్పుడూ ; అయం = పురుషుడు; ఇంద్రియార్థేభ్యః = ఇంద్రియ విషయాల నుంచి ; ఇంద్రియాణి = ఇంద్రియాలను ; సంహరతే = వెనక్కి మళ్ళిస్తున్నాడో ; తస్య = అతని ; ప్రజ్ఞా = జ్ఞానం ; ప్రతిష్ఠితా = స్థిరమైనది

తాత్పర్యం

తాబేలు తన అవయవాలను అన్ని వైపుల నుంచి విధంగా లోపలికి ముడుచుకుంటుందో, అదే విధంగా ఒకానొక పురుషుడు ఇంద్రియాలను వాటి విషయాల నుంచి వెనక్కి మళ్ళించాలి ; అప్పుడు అతని జ్ఞానం స్థిరంగా వుంటుంది. ”

వివరణ

అవసరమున్నప్పుడే ఆయుధ ప్రహారం చేయాలి.

అవసరంలేనప్పుడు ఆయుధాలను ఎంచక్కా ప్రక్కన బెట్టాలి.

అలాగేఇంద్రియాలుకూడా

భౌతిక జీవనార్థం వుపయోగించే ఉపకరణాలు మాత్రమే.

ఇంద్రియాల అవసరం వున్నప్పుడే వాటిని వ్యక్తపరచాలి.

వాటి అవసరం తీరగానే వాటిని వెంటనే ఉపసంహరించేయాలి.

అవయవాల అవసరం లేనప్పుడు, ఇంకా ఏదైనా అలికిడి అయినప్పుడు

తాబేలు తన అవయవాలన్నింటినీ తన డిప్పలోకి లాగేసుకుని

ముడుచుకుంటుంది.

అలాగే ప్రతి యోగీ కూడా జీవించాలి.

అలా చేసేవాడి శక్తి ఎప్పుడూ విజృంభించి వుంటుంది.

అలా చేసేవాడి జ్ఞానం ఎప్పుడూ సునిశితమై వుంటుంది.

అనవసరం అయినప్పుడల్లా మనస్సు సంపూర్ణంగా బాహ్య ఇంద్రియ 

విషయాలను వదిలెయ్యాలి.

యా సమయాల్లో, సందర్భాలలో

సంపూర్ణంగా అంతర్ముఖమై ఆత్మలో స్థితమవ్వాలి.