వృద్ధుడు

 

ఆజ్ఞో భవతి వై బాలః పితా భవతి మంత్రదః

ఆజ్ఞం హి బాలమిత్యాహుః పితత్యేన తు మంత్రదమ్”

= మను స్మృతి

“నూరేళ్ళ వయస్సు కలవాడైనా విద్యా విజ్ఞానాలను ఇచ్చేవాడైతే బాలుడైనా ‘వృద్ధుడు’ అని అంగీకరించాలి;

ఎందుకంటే సకల శాస్త్రాలూ, ఆప్త విద్వాంసులూ అజ్ఞానిని ‘బాలకుడు’ అనీ, జ్ఞానిని ‘పిత’ అనీ అంటారు”

= దయానంద – గోపదేవ్ ఆధారంగా

ధమ్మపదంలో బుద్ధుడు ఇలా చెప్పాడు:

“న తేన థేరో సోహుతి, యేన స్స పలితం సిరోః”

“తల నెరిసినంత మాత్రాన మనిషి ధీరుడు కాజాలడు” అని

వయస్సుతో ఎవడైనా వృద్ధుడు అవుతాడు; దానివల్ల ఏమీ లాభం లేదు; కావలసింది జ్ఞాన వృద్ధత్వం.