శ్వాసే గురువు
ఏ వ్యక్తీ ఇంకొక వ్యక్తికి గురువు కాదు.
“ఎవ్వరయ్యా ” గురువు అంటే శ్వాసే.
ఎవరి శ్వాస వారి గురువు.
దేహంలో దీపాన్ని వెలిగించే గురువే శ్వాస.
ఈ రోజు గురు పౌర్ణమి. అంటే శ్వాస పౌర్ణమి. వ్యాస పౌర్ణమి.
“తంత్రం – పరతంత్రం –స్వాతంత్ర్యం ”
మనం సంపూర్ణమైన స్వతంత్రం కలిగిన వాళ్ళం.
మనపై ఎవరి అదుపూ ఉండరాదు.
ఒకరి అదుపులో ఉన్నవారు పరతంత్రులు.
‘తంత్రం’ అంటే దేహానికి బానిసత్వ స్థితి – బాడీ డిపెండెంట్ జీవితం …
‘పరతంత్రం ‘ అంటే ఇతరులకు బానిసత్వ స్థితి – అదర్ డిపెండెంట్ జీవితం…
స్వాతంత్ర్యం అంటే సంపూర్ణ విముక్తి స్థితి – సోల్ డిపెండెంట్ జీవితం…..
తప్పనిసరి అయితేనే ఇతరుల సహాయం తీసుకోవాలి.
అంతేకానీ జనరల్‍గా ఎవ్వరూ ఇంకొకరి మీద డిపెండ్ కారాదు.
మన సామర్థ్యశక్తి అపూర్వం.
అయితే, శోచనీయ విషయమేమిటంటే, మనం అందులో సహస్రాంశం కూడా ఉపయోగించుకోవడం లేదు.
అందుకే మనకీ దురవస్థ.
నెవర్ థింక్ ఫ్రమ్ బాడీ పాయింట్ ఆఫ్ వ్యూ….థింక్ ఆల్వేస్ ఫ్రమ్ సోల్ పాయింట్ ఆఫ్ వ్యూ.
గ్రహం = తీసుకోవడం, దేహానికి బానిస … తంత్రం
పరిగ్రహం = విశేషంగా తీసుకోవడం, బానిస బ్రతుకు … పరతంత్రం
అపరిగ్రహం = అసలు తీసుకోకపోవడం, ఆధ్యాత్మికం … స్వతంత్రం
పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‍మెంట్ 18 ఆదర్శ సూత్రాలలో 15 వ పాయింట్‍ను చదవండి.
ఎవరి సమస్యలను వారే పరిష్కరించుకోవాలి.
అదే స్వతంత్రం.
శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయాలి.
మాట మీద ధ్యాస పెట్టి జ్ఞానంతో జీవించాలి.
అప్పుడు ఎవరిపైనా ఆధారపడవలసిన అవసరం రానే రాదు. ఉద్ధరేదాత్మానాత్మానం .
నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. నీ దీపాన్ని నువ్వే వెలిగించుకోవాలి.
సత్యం = శుభం = లాభం
అసత్యం =అశుభం = నష్టం
శుభం వల్ల … లాభం
అశుభం వల్ల …నష్టం
సత్యం వల్ల … శుభం
అసత్యం వల్ల… అశుభం